ప్రస్తుతం టీమిండియా సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉంది పర్యటనలో భాగంగా డిసెంబర్ 26 నుండి టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతోంది. ఇందుకోసం ఎంపిక చేసిన జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, మహమ్మద్ షమీ వంటి ప్లేయర్లు ఉన్నారు. టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవ్వకముందు టీమిండియా కి ఎదురు దెబ్బ తగిలినట్టు కనబడుతోంది సీనియర్ పేసర్ షామీ టెస్ట్ సిరీస్ కి అందుబాటులో ఉండటం లేదని తెలుస్తోంది.
Advertisement
అతను చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. షమీ ఈ నొప్పిని తగ్గించుకోవడానికి ముంబైలోని ప్రముఖ స్పోర్ట్స్ ఆర్థోపెడిక్ డాక్టర్ ని కన్సల్ చేశాడు. కోల్కొని మ్యాచ్ ఆడడానికి ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో టెస్ట్ సిరీస్ కి అతను దూరం కాబోతున్నట్లు తెలుస్తోంది కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నారట. సౌత్ ఆఫ్రికా తో టెస్ట్ సిరీస్ కి షమీ అందుబాటులో ఉంటాడా లేదా అనేది ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఇక రెండు టెస్టు సిరీస్ ల కోసం ఎంపికైన టీమిండియా ఆటగాళ్ళు సౌతాఫ్రికా కి శుక్రవారం వెళ్లబోతున్నారు.
Advertisement
రోహిత్ శర్మతో పాటుగా విరాట్ కోహ్లీ, బుమ్రా, అశ్విన్ సహా పలువురు ఆటగాళ్లు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. షమీ ఆడకపోతున్నట్లయితే ఇంకొక బౌలర్ కి అవకాశం ఇవ్వబోతున్నారు. ఇక టీం వివరాలు చూస్తే.. రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ.
స్పోర్ట్స్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!