Home » ముసలోడా అంటూ అమితాబ్ కి అవమానం.. ఫైర్ అవుతున్న నెటిజెన్స్..!!

ముసలోడా అంటూ అమితాబ్ కి అవమానం.. ఫైర్ అవుతున్న నెటిజెన్స్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

బాలీవుడ్ స్టార్ హీరో అయినా అమితాబ్ బచ్చన్ గురించి, ఆయన సినిమాల గురించి, ఆయన సాధించిన విజయాల గురించి ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ బిగ్ బీ గా ఆయనకు ఉన్న గుర్తింపు మరే స్టార్ కి లేదు.. రాదు కూడా..కేవలం హిందీ లోనే కాదు ప్రపంచం మొత్తంలో ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన గురించి నెగిటివ్ కామెంట్స్ చేయడానికి స్టార్ హీరోలు కూడా భయపడతారు. కానీ కొంతమంది ఆకతాయిలు మాత్రం సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ పబ్బం గడుపుతుంటారు. అయితే తాజాగా ఒక నెటిజన్ అమితాబచ్చన్ చాలా అవమానించారు. ముసలోడా అంటూ అగౌరవంగా మాట్లాడారు. సదరు నెటిజన్ అంత గౌరవం లేకుండా మాట్లాడినా కూడా అమితాబచ్చన్ గారు ఎంతో ఓపికగా సమాధానం చెప్పడమే కాకుండా స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చాడు. అసలు ఏం జరిగిందంటే.. సరిగ్గా ఉదయం 11:30 నిమిషాలకు గుడ్ మార్నింగ్ అంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అమితాబచ్చన్. దీనికి బదులుగా పలువురు నెటిజన్లు 11:30 గుడ్ మార్నింగ్ ఏంటి? ఎర్లీ మార్నింగ్ అనుకుంటున్నారా?అని ఒక నెటిజన్ అడగ్గా..క్షమించాలి మిమ్మల్ని డిస్టర్బ్ చేసి ఉంటే,రాత్రంతా షూటింగ్ చేసి వచ్చి ఉదయాన్నే వచ్చి పడుకున్నాను. ఇప్పుడే లేచాను. నేను లేచిన నిమిషం నాకు గుడ్ మార్నింగే కదా. అందుకే అందరిని పలకరించాను అని అమితాబచ్చన్ చెప్పుకొచ్చారు. ఇక మరొక నెటిజన్ అయితే ఇది మధ్యాహ్నం ముసలోడా.. అంటూ దురుసుగా మాట్లాడినా అతడికి కూడా ఓపికగా సమాధానం ఇచ్చాడు అమితాబ్. మీరు చాలా కాలం బ్రతకాలని ప్రార్థిస్తున్నాను. అయితే మిమ్మల్ని ఎవరూ ముసలోడు అని పిలిచి అవమానించకూడదని కోరుకుంటున్నాను అంటూ అమితాబ్ బచ్చన్ గారు రిప్లై ఇచ్చారు. దీంతో పెద్ద వారిని ఎలా గౌరవించాలో చెంపపెట్టు తగిలేలా చెప్పారు. అయితే ఈ ఇష్యు పై అమితాబ్ బచ్చన్ కి పలువురు మద్దతుగా నిలబడుతున్నారు. ఆయన ఎక్స్పీరియన్స్ అంత వయసు ఉండదు నీకు, ఆయనను అవమానిస్తావా అంటూ నేటిజెన్స్ సదరు వ్యక్తిని విమర్శిస్తున్నారు.

Advertisement

ALSO READ;

Samantha: మ‌రొక పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు స‌మంత గ్రీన్ సిగ్న‌ల్‌..!

సౌత్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే.. ఆశ్చర్య పోవాల్సిందే..?

 

 

 

Visitors Are Also Reading