Home » కిరాక్ ఆర్పీ ఫ్రాడ్ 20ల‌క్ష‌లు మోసం చేశాడు..శేకింగ్ శేషు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు..!

కిరాక్ ఆర్పీ ఫ్రాడ్ 20ల‌క్ష‌లు మోసం చేశాడు..శేకింగ్ శేషు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు..!

by AJAY
Ad

తెలుగులో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న జ‌బ‌ర్ద‌స్త్ నుండి జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించిన నాగ‌బాబు వెళ్లిపోయిన సంగ‌తి తెలిసిందే. నాగ‌బాబు వెళ్లిపోయిన త‌ర‌వాత ఆ షో నుండి ఒక్కొక్క‌రు బ‌య‌ట‌కు జారుకుంటున్నారు. అయితే వెళ్లిపోతే ఎలాంటి స‌మ‌స్య ఉండ‌దు కానీ ఇంత‌కాలం ప‌నిచేసిన జ‌బ‌ర్ద‌స్త్ షో పై మ‌రియు మ‌ల్లెమాల శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. రీసెంట్ ఇంట‌ర్య్వూలో కిర్రాక్ ఆర్పీ కూడా అలాంటి కామెంట్ల‌నే చేసి వార్త‌ల్లో నిలిచారు.

Advertisement

త‌న‌కు ఈటీవీ అంటే ఇష్టం కానీ మ‌ల్లెమాల, శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి, జ‌బ‌ర్ద‌స్త్ అంటే ఇష్టం లేద‌ని చెప్పారు. అంతే కాకుండా అక్క‌డ ఫుడ్ అస్స‌లు బాగుండ‌ద‌ని చ‌ర్ల‌ప‌ల్లి అండ‌మాన్ జైల్లో భోజ‌నం కంటే దారుణంగా ఉంటుంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఇక ప్ర‌స్తుతం ఆర్పీ చేసిన కామెంట్లు వైర‌ల్ అవుతుండ‌టంతో జ‌బ‌ర్ద‌స్త్ లో ప్ర‌స్తుతం న‌టిస్తున్న వాళ్లు వ‌చ్చి కౌంట‌ర్ లు ఇస్తున్నారు.

Advertisement

తాజాగా ఓ ఇంట‌ర్య్వూలో జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడిష‌న్ షేకింగ్ షేషు ఆర్జీపై సంచ‌న‌ల ఆరోప‌ణ‌లు చేశాడు. జ‌బ‌ర్ద‌స్త్ లో భోజనం బాగోలేకుంటే ఎనిమిదేళ్లు ఎందుకు ఉన్నాడ‌ని ప్ర‌శ్నించాడు. అంతే కాకుండా ఆర్పీ సినిమా చేస్తాన‌ని చెప్పి త‌మ ఊరి నుండి ఒక నిర్మాత‌ను తీసుకువ‌చ్చి సినిమా ప్రారంభం కాక‌ముందే అత‌డితో 20ల‌క్ష‌లు ఖ‌ర్చుచేయించి మోసం చేశాడ‌ని చెప్పాడు. దాంతో ఆయ‌న నిర్మాత‌ల మండలిలో ఫిర్యాదు చేశాడ‌ని చెప్పారు.

అంతే కాకుండా కిర్రాక్ ఆర్పీ త‌న యూట్యూబ్ ఛాన‌ల్ చూపించిన ఇల్లు త‌న‌ది కాదని చెప్పాడు. ఓ ఇంటీయ‌ర్ డిజైన‌ర్ ఇంటిని త‌న ఇంటిలా చూపించి యూట్యూబ్ నుండి డ‌బ్బులు సంపాదించుకున్నాడ‌ని చెప్పారు. ఆ ఇల్లు చూసి తాము కూడా షాక్ అయ్యామ‌ని వెల్ల‌డించాడు. ఇక షేషు కామెంట్స్ త‌ర‌వాత చాలా మంది జ‌బ‌ర్దస్త్ కు స‌పోర్ట్ చేస్తూ ఆర్పీ పై మండిప‌డుతున్నారు.

ALSO READ :హీరో సుమ‌న్ నీలిచిత్రాల‌ కేసులో ఇరికించింది ఎవ‌రు…? అర్ధరాత్రి పోలీసులు వచ్చి ఏమి చేసారంటే ?

Visitors Are Also Reading