Home » నాలుగేళ్ల పాటు సైన్యంలో ఉంటే.. ఆ త‌రువాత న‌చ్చిన ఉద్యోగం చేయ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

నాలుగేళ్ల పాటు సైన్యంలో ఉంటే.. ఆ త‌రువాత న‌చ్చిన ఉద్యోగం చేయ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

by Anji
Ad

కేంద్ర ప్ర‌భుత్వం నిరుద్యోగుల‌కు ఓ శుభ‌వార్త చెప్పింది. దేశ‌వ్యాప్తంగా ఉద్యోగాల జాత‌ర ఉంటుంద‌ని ప్ర‌క‌ట‌న చేసింది. ఏడాదిన్న‌ర‌లో భారీ ఎత్తున కేంద్ర ప్ర‌భుత్వ శాఖ‌లో కొలువుల‌ను భ‌ర్తీ చేసేందుకు మోడీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఏకంగా 10ల‌క్ష‌ల ఉద్యోగాల నియ‌మ‌కాల‌ను చేప‌ట్టాల‌ని ప్రధాని మోడీ ఆదేశాలు జారీ చేసారు. త్రివిద ద‌ళాల్లో చేరి దేశానికి సేవ చేయాల‌నుకునే యువ‌త కోసం కేంద్రం కొత్త విధానాన్ని తీసుకొచ్చిన త‌రుణంలో నిరుద్యోగులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. యువ‌త‌ను సైన్యంలోకి తీసుకునేందుకు ప్ర‌వేశ‌పెట్టిన అగ్నిప‌థ్ అనే కొత్త రిక్రూట్‌మెంట్ స్కీమ్‌ను కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు.

Advertisement

రానున్న 15 నెల‌ల్లో దాదాపు 10ల‌క్ష‌ల ఉద్యోగాలు భ‌ర్తీ చేయాల‌ని ఆయా శాఖ‌ల‌ను ప్ర‌ధాని ఆదేశించిన‌ట్టు పీఎంఓ ప్ర‌క‌టించింది. భార‌త సైన్యాన్ని మ‌రింత యూత్‌పుల్‌గా టెక్ సావిగా తీర్చిదిద్ద‌డం కోసం దేశ యువ‌త‌ను వినియోగించుకోవాల‌ని సైనిక అధికారులు తెలిపారు. అగ్నిప‌థ్ లో భాగంగా నియ‌మించే సైనికుల‌ను అగ్ని వీరులంటారు. వీరు దాదాపు నాలుగు సంవ‌త్స‌రాల పాటు సైన్యంలో ప‌ని చేయ‌వ‌చ్చు.ఈ అవ‌కాశం ప్ర‌స్తుతం కేవ‌లం అబ్బాయిల‌కు మాత్ర‌మే క‌లదు. ఆ త‌రువాత అమ్మాయిల‌కు అవ‌కాశం క‌ల్పిస్తారు.

Advertisement

ముఖ్యంగా దేశానికి సేవ చేయాల‌నే స్ఫూర్తి ఉన్న యువ‌త‌కు ఈ అగ్నిప‌థ్ స్కీమ్ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇందుకు వ‌య‌స్సు 17.5 సంవ‌త్స‌రాల నుంచి 21 ఏళ్ల వ‌య‌స్సు మ‌ధ్య ఉండ‌వ‌లెను. మొద‌టి సంవ‌త్స‌రం రూ.4.76 ల‌క్ష‌ల ఫ్యాకేజీ ఇస్తారు. ఇక నాలుగ‌వ ఏడాదిలో రూ. 6.92 ల‌క్ష‌లు ల‌భిస్తాయి. వీరికి ప‌ద‌వీ విర‌మ‌ణ త‌రువాత పెన్ష‌న్ ఉండ‌దు. పెన్ష‌న్‌కు సంబంధించిన ఫ్యాకేజ్ మొత్తం ఒకేసారి అందిస్తారు. అగ్నివీరులు భ‌విష్య‌త్ సైనికులు అవుతార‌ని.. చాలా క‌ఠినమైన ప‌ద్ద‌తితో వారి నియ‌మాకాలు చేప‌డుతామ‌ని సైన్యం వెల్ల‌డించింది. 90 రోజుల్లోనే తొలి విడుత అగ్నివీరుల రిక్రూట్‌మెంట్ ఉండ‌నున్న‌ది. ఈ ప‌థ‌కం ద్వారా సైన్యంలో 25శాతం మంది యువ‌త‌ను త‌రువాత రీటెయిన్ చేస్తారు. 100లో 25 మందికి శాశ్వ‌త సేవ‌లందించే అవ‌కాశం ల‌భిస్తుంది.

Also Read : 

ఖడ్గం సినిమా చేసినతరువాత హీరో శ్రీకాంత్ ని ఎవరు బెదిరించారు ? అప్పుడు శ్రీకాంత్ జోబులో ..!

ఏఆర్ రెహ‌మాన్ పెద్ద కూతురు ఖ‌తీజా పెళ్లి వీడియో మీరు చూశారా..?

 

Visitors Are Also Reading