Home » సీరియల్స్ వాళ్ళు ఒక సారి వేసుకున్న జ్యూవెలరీ, కాస్ట్యూమ్స్ ని ఏమి చేస్తారంటే ?

సీరియల్స్ వాళ్ళు ఒక సారి వేసుకున్న జ్యూవెలరీ, కాస్ట్యూమ్స్ ని ఏమి చేస్తారంటే ?

by Azhar
Ad

మన దేశంలో వెండితెరకు ఎంత ప్రాముఖ్యత ఉందొ… బుల్లితెరకు కూడా అంతే ఉంది. ఇంకా చెప్పాలంటే బుల్లితెరలో వచ్చే వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. టీవీల్లో ప్రసారమయ్యే సీరియల్స్ కు.. అందులో నటించే నటులకు అభిమానులు బాగానే ఉంటారు. మరి ముఖ్యంగా సీరియ్సల్ మొత్తం ఏడుస్తూ ఉండే పాత్రకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ మధ్య సీరియల్స్ రేంజ్ కూడా పెంచుతున్నారు. అద్భుతమైన లొకేషన్స్ లో.. పెద్ద పెద్ద ఇళ్లలో మంచి మంచి కాస్ట్యూమ్స్ వేసుకొని నటిస్తున్నారు.

Advertisement

 

అయితే ఈ కాస్ట్యూమ్స్ గురించి ఎవరికీ తెలియని కొన్ని నిజాలను చిన్న కోడలు సీరియల్ నటి రూప బయటపెట్టారు. తాజాగా ఏ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆవిడ మాట్లాడుతూ… సీరియల్స్ లో మేము ఉపయోగించే కాస్ట్యూమ్స్ మొత్తం మా సొంత కాస్ట్యూమ్స్ అని తెలిపారు. సీరియల్ యాజమాన్యం మాకు కాస్ట్యూమ్స్ ఇవ్వదని తెలిపారు.

Advertisement

కానీ ఒక్కసారి ఉపయోగించిన కాస్ట్యూమ్స్ ను మీరు మళ్ళీ వాడారు కదా.. వాటిని ఏం చేరారు అని ప్రశ్నించగా.. మేము వాడిన కాస్ట్యూమ్స్ ను మళ్ళీ వాడుతాం. కానీ వెంటవెంటనే ఉపయోగించం. అందుకే చూసేవారికి అలా అనిపిస్తుంది అని చెప్పారు. ఇక తనకు సీరియల్స్ ప్రారంభించిన మొదట్లో సినిమా అవకాశాలు వచ్చాయని.. కానీ అప్పుడు తాను ఒప్పుకోలేదు అని చెప్పారు. అలాగే ఇప్పుడు ఎథియానా మంచి పాత్ర వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా ఆమె ప్రకటించారు.

Also read: ఈ 5 సినిమాలు థియేటర్ లో ఫట్…కానీ టీవిలో సూపర్ హిట్….!

Visitors Are Also Reading