ఏపీలో నేడు గడప గడపకు ప్రభుత్వంపై వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సీఎం జగన్, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు.
ఈ నెల 29 నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు హైకోర్టుకు దసరా సెలవులు ప్రకటించారు.
Advertisement
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలుగు రెండు రోజుల పాటూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. తెలంగాణలో పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షం… రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది.
నేడు 21వ రోజు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చురుకుగా పాల్గొంటున్నారు.
Advertisement
ఇండియా గేట్ వద్ద “కర్తవ్య పథ్” పై బతుకమ్మ ఆడారు. తెలంగాణ నుంచి ప్రత్యేకంగా ఢిల్లీకి వచ్చి మహిళలు, యువతులు బతుకమ్మ ఆడారు. కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి
సైతం యువతులతో కలిసి బతుకమ్మ ఆడారు.
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పై ఈడీ విచారణ జరుగుతోంది. సుమారు తొమ్మిది గంటల పాటు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఈడీ విచారించింది. విదేశాల్లో పెట్టిన పెట్టుబడులపై ఈడీ ఆరా తీస్తోంది. ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై సుదీర్ఘంగా ఈడీ విచారించింది.
ఏపీకి ప్రత్యేక హోదా లేదని విభజన హామీల అమలు లేదని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. 31 మంది ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెస్తే ఎందుకు న్యాయం జరగదు? అని ప్రశ్నించారు. ఏపీ ప్రజల భవిష్యత్తును మోడీకి జగన్ తాకట్టు పెట్టారని అన్నారు.
హెచ్‌సీఏపై మరో కేసు నమోదయ్యింది. మ్యాచ్ టికెట్లపై సమయం తప్పుగా ముద్రించారని ఫిర్యాదు చేశారు. బేగంపేట పీఎస్‌లో కేసు నమోదు చేశారు. టికెట్ల విక్రయం, తొక్కిసలాటతో ఇప్పటికే హెచ్‌సీఏపై మూడు కేసులు నమోదయ్యిందయ్యాయి.