Home » sep 18th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

sep 18th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

రాజస్థాన్ తదుపరి సీఎం పగ్గాలు సచిన్ పైలెట్ కు అందబోతున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా సీఎం రేసులో అశోక్ గెహ్లాట్ కూడా ఉన్నారు.

వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వ్యాఖ్యల పై సెటైర్స్ వేశారు. తెలుగుదేశం నారా వారి పార్టీ అయ్యిందని ముందు తమ తాత పార్టీని లాక్కోవాలని అన్నారు.

Advertisement

అక్కన్నపేట మెదక్ లో మధ్య నిర్మించిన 17 కిలోమీటర్ ల రైలు మార్గాన్ని నేడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు.

ఇరాన్ లో ఓ వైపు హిజాబ్ వ్యతిరేఖ నిరసనలు వినిపిస్తుంటే మరోవైపు ఆ దేశ అధ్యక్షుడు చేసిన పని షాక్ కు గురి చేస్తోంది. హిజాబ్ దరించలేదని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి అమెరికా జర్నలిస్ట్ కు ఇంటర్వ్యూ ఇవ్వడానికి నిరాకరించాడు.

Advertisement

Ap cm jagan

Ap cm jagan

నేడు కుప్పంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. జగన్ పర్యటన సందర్భంగా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. తొలిసారిగా సీఎం హోదాలో జగన్ కుప్పం లో పర్యటిస్తున్నారు. అక్కడ 3వ విడత వైఎస్సార్‌ చేయూత పథకాన్ని ప్రారంభించనున్నారు.


నేడు రాహుల్ గాంధీ “భారత్ జోడో” పాదయాత్రకు బ్రేక్‌ పడింది. ఇప్పటివరకు 15 రోజుల్లో 333 కీలీమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. తిరిగి రేపు “భారత్ జోడో” పాదయాత్ర ప్రారంభం కానుంది.

అజారుద్దీన్ సహా హెచ్‌సీఏ నిర్వాహకులపై మూడు కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ యాక్ట్ తో పాటు 420, 21,22/76 పలు సెక్షన్ల కింద బేగంపేట్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు.

తెలంగాణ నీటి సమస్యలపై కేంద్ర జలవనరుల శాఖ సెక్రటరీకి తెలంగాణ ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ లేఖలు రాశారు.

Visitors Are Also Reading