Home » sep 17th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

sep 17th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

నేడు తెలంగాణ భవన్‌లో తెలంగాణ సమైక్యతా దినోత్సవం నిర్వహిస్తున్నారు. కే.కేశవరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

 

పరేడ్‌ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రారంభించారు. ఈ వేడుకల్లో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే పాల్గొన్నారు.

Advertisement

 

నేడు ప్రధాని మోడీ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ లేఖ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

మంత్రి జగదీశ్వర్ రెడ్డి జయహో అంటూ ఎస్పీ అనడం పై విమర్శలు వస్తున్నాయి. ఎంపీ ఉత్తమ్ కుమార్ ఈ ఘటనపై ఫైర్ అయ్యారు. ఎస్పీ తీరు సిగ్గుచేటు అన్నారు. సీఎం కాళ్ళు మొక్కిన కలెక్టర్ ఎమ్మెల్సీ అయ్యారని అన్నారు.

 

ఈడి నుండి తనకు నోటీసులు అందాయి అన్న వార్తల్లో నిజం లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

Advertisement

ఫిల్మ్ నగర్ లో కృష్ణం రాజు విగ్రహ ఏర్పాటు చేస్తామని మంత్రి తలసాని అన్నారు. దీని పై సొసైటీ వాళ్ళతో మాట్లాడుతామని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ప్రజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబర్ 17 ను విలీనం…విమోచనం ఏ పేరుతో పిలిచినా పర్వాలేదని అన్నారు. ఇది తెలంగాణ ప్రజలకు సంపూర్ణ స్వేచ్చ దొరికిన రోజు అన్నారు.

 

లెఫ్ట్ పార్టీలు నేడు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ రైతాంగ పోరాట వార్షికోత్సవాలను నిర్వహిస్తున్నాయి.

లిక్కర్ స్కాం లో హైదరాబాద్ లో జరుగుతున్న ఈడి సోదాలు ముగిశాయి. సీఏ గోరంట్ల బుచ్చిబాబు చుట్టూ ఈడి రైడ్స్ తిరిగాయి.

Visitors Are Also Reading