Home » sep 14th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

sep 14th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

వైసీపీ ఎంపీ మాధవికి కేంద్రం కీలక పదవిలో నియమించింది. కాఫీ బోర్డు లో సభ్యురాలిగా నియమిస్తూ గెజిట్ ను విడుదల చేసింది.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లో వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. ఓ మహిళ రాహుల్ కు పెళ్లి సంబంధం చూస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు మరో మహిళ వచ్చి రాహుల్ ను ఆప్యాయంగా హత్తుకుంది.

Advertisement

ఎనికల్లో పోటీ చేయడం ప్రాథమిక హక్కు కాదని సుప్రీం కోర్టు తెలిపింది. ఎన్నికల్లో పోటీ చేయడం అనేది శాసనం ద్వారా అమలు అయ్యే హక్కు అని స్పష్టం చేసింది.

రేపు ఉదయం ఏపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయు. 5 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.

దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. దసరా పండగ సందర్భంగా పలు ప్రాంతాలకు స్పెషల్ రైళ్ళను నడుపుతున్నట్టు స్పష్టం చేసింది.

Advertisement

తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. రెండో మలుపు దగ్గర ఆర్టీసీ బస్సు కారును ఢీ కొట్టింది. ఆ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా మరో నలుగురికి గాయాలు అయ్యాయి.

సికింద్రాబాద్‌ అగ్నిప్రమాదంపై కేంద్ర రవాణాశాఖ దర్యాప్తుకు ఆదేశించింది. ప్రమాదం జరిగిన తీరుపై ఇద్దరు నిపుణులతో దర్యాప్తు చేస్తోంది. ఎలక్ట్రిక్‌ బైక్‌లలో తరచూ మంటలు రావడాన్ని రవాణా శాఖ సీరియస్‌గా తీసుకుంది. బ్యాటరీల్లో అదనపు భద్రత పాటించాలని కంపెనీలకు సూచించింది.

111 జీవోపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ మేరకు తెలంగాణ సర్కార్ అఫిడవిట్‌ దాఖలు చేసింది. కొత్త జీవో 69 అమలయ్యే వరకు పాత నిబంధనలు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం అఫిడవిట్‌ లో పేర్కొంది.


నేడు సాయంత్రం 5 గంటలకు భూమా అఖిలప్రియ, విఖ్యాత్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా భూమా మౌనిక -హీరో మనోజ్ పెళ్ళి ఎపిసోడ్ అంశంపై మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యే వినాయకుడి పూజలో మనోజ్ -మౌనిక లు కలిసి పూజ చేసిన సంగతి తెలిసిందే.

Visitors Are Also Reading