Home » sep 12th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..! » Page 2

sep 12th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

హైదరాబాద్‌ లోని మొయినాబాద్‌లో నేడు కృష్ణంరాజు అంత్యక్రియలు జరగనున్నాయి. కనకమామిడి ఫామ్‌హౌస్‌లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Advertisement

దేశానికే తెలంగాణ మోడల్‌ కానుందని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. దేశానికి తెలంగాణ మోడల్‌ అవసరమని వ్యాఖ్యానించారు. బీజేపీ ముక్త్‌ భారత్‌ కోసం కలిసి పనిచేస్తామన్నారు. తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్‌ ఆయన అనుభవం ప్రస్తుతం దేశానికి అవసరమని చెప్పారు.

ఏపిలోని కొన్ని జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మత్యకారులు చేపల వేటకు వెళ్ళకూడదు అని హెచ్చరించింది.

భారత్ లో జననాల రేటు తగ్గడం తో స్కూల్ లో చేరే విద్యార్థుల సంఖ్య కూడా తగ్గుతుందని ఎన్సీఆర్టీ వెల్లడించింది.

Advertisement

దక్షిణాఫ్రికా, నమీబియా నుండి ఇండియా కు 27 చిరుత పులులను తీసుకువచ్చారు. వీటిని మధ్యప్రదేశ్ లోని కే ఎన్ పార్క్ లో సంరక్షించనున్నారు.

దేశవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగుతున్న స్థలాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా సహా పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది.


తెలంగాణ లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ లు ప్రజలకు అందుబాటులో ఉండాలని ….వారిని ఆదుకోవాలి అని ఆదేశించారు.

Visitors Are Also Reading