ఆగస్ట్ నెలలో 22.22 లక్షల మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.140.34 కోట్ల ఆదాయం వచ్చింది. కోటి 5 లక్షల లడ్డుల విక్రయం జరిగింది. 47.76 లక్షల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది.
Advertisement
పార్వతీపురం సాలూరు టౌన్ పీఎస్ లో భారీ పేలుడు చోటు చేసుకుంది. సీజ్ చేసిన బాణసంచా పేలడంతో మంటలు చెలరేగాయి. భారీ శబ్ధం రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
రాహుల్ గాంధీ నేడు రాత్రికి కేరళలోకి ప్రవేశించనున్నారు. దగ్గర్లోని చెరువర కోణం నుంచి రాహుల్ పాదయాత్ర కేరళలోకి ప్రవేశించనున్నారు. కేరళలో19 రోజులు 457 కిలోమీటర్ల మేర రాహుల్ పాదయాత్ర సాగనుంది.
ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు జరగనున్నాయి. స్టేట్ టాక్స్ చీఫ్ కమిషనర్ గా గిరిజా శంకర్..పౌరసరఫరాల శాఖ స్పెషల్ సెక్రెటరీ, కమిషనర్‌గా హెచ్. అరుణ్ కుమార్…జీఏడీ సెక్రెటరీగా పోల భాస్కర్‌కు అదనపు బాధ్యతలు స్వీకరించారు.
Advertisement
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద నీరు చేరింది. 22 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో: 3,90,158 క్యూసెక్కులు గా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం: 588.20 అడుగులకు చేరింది.
హైదరాబాద్ నారాయణగూడ నుంచి ట్యాంక్ బండ్ వరకు వినాయక విగ్రహాలు నిలిచిపోయాయి. ఎన్టీఆర్ మార్గ్ లో రెండు వైపులా విగ్రహాలు నిలిచిపోయాయి. మధ్యాహ్నం వరకు నిమజ్జన కార్యక్రమం జరగనుంది.
భద్రాద్రి కొత్తగూడెంలో నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సింగరేణి బొగ్గు గనుల్లో బొగ్గు వెలికి తీతకు అంతరాయం ఏర్పడింది. కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు, సత్తుపల్లిలో బొగ్గు వెలికితీత పనులు నిలిచిపోయాయి.
ప్రభుత్వ ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలంగాణ నుంచి ఏపీకి బదిలీ కోరుతూ 1338 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లేందుకు 1804 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు.