Home » SR. NTR అంతటి హోదాలో ఉన్న విజయశాంతిని క్షమించమని కోరారు.. ఎందుకో తెలిస్తే..?

SR. NTR అంతటి హోదాలో ఉన్న విజయశాంతిని క్షమించమని కోరారు.. ఎందుకో తెలిస్తే..?

by Sravanthi
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా, రాజకీయనాయకుడిగా, మంచితనానికి మారుపేరుగా పేద ప్రజల దేవుడిగా ఎన్నో కొత్త పథకాలు అందించిన ప్రజా ముఖ్యమంత్రిగా, తెలుగు ఇండస్ట్రీని టాప్ లెవెల్ లో ఉంచిన నటుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు సీనియర్ ఎన్టీఆర్. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దేశమంతా కాంగ్రెస్ పాలన నడుస్తున్న సమయంలో పార్టీ పెట్టి సంవత్సరంలోపే తెలుగు రాష్ట్రాల్లో టిడిపిని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఆయనది. ఆయన చరిత్రను ఇప్పటివరకు ఏ నాయకుడు కానీ, ఏ హీరో కానీ తిరగ రాయలేదు. అంతటి ఘన చరిత్ర కలిగి ఉన్న ఎన్టీఆర్ ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండేవారు.

Advertisement

తన తోటి నటులతో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా కలివిడిగా ఉండేవారు. అలాంటి యుగ పురుషుడు పుట్టి వంద సంవత్సరాలు అయిన సందర్భంగా శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనతో జర్నీ చేసిన ఎంతోమంది నటీనటులు, రాజకీయ నాయకులు, వారి యొక్క అనుభూతిని పంచుకున్నారు. ఈ తరుణంలో సినీనటి రాజకీయ నాయకురాలు విజయశాంతి కూడా ఒక సంచలన విషయాన్ని బయట పెట్టింది. అదేంటో ఇప్పుడు చూద్దాం.. 1980లో నేను 14 సంవత్సరాల చిన్న పిల్లగా నా జీవిత ప్రయాణ ప్రారంభంలో సత్యం శివం సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్నార్ గారితో నటించే అవకాశం కలిగింది. అప్పుడే ఆయనతో తొలిసారిగా నటించాను. అలా ఎన్టీఆర్ నాకు పరిచయమయ్యారు.

Advertisement

అయితే బ్రహ్మశ్రీ విశ్వామిత్ర చిత్రం డబ్బింగ్ ఎన్టీఆర్ గారు ఏవీఎం స్టూడియోలో చెబుతున్నప్పుడు ..నేను చిరంజీవి గారితో అదే స్టూడియోలో సినిమా చేస్తూ డబ్బింగ్ థియేటర్లో కలవడానికి వెళ్లాను. ఆ థియేటర్లో వెలుతురు లేని వాతావరణం వారు నన్ను సరిగా గమనించలేదని బాధపడ్డాను. అయితే ఈ విషయం తెలుసుకున్నరు ఎన్టీఆర్. తర్వాతి రోజు ఆరు గంటలకే మద్రాసులో మా షూటింగ్ కు వెళ్లాను. ఈ సమయంలో నా భర్త శ్రీనివాస ప్రసాద్ నా దగ్గరికి వచ్చి ఈ విషయం చెప్పారు. పొరపాటు జరిగిందమ్మ, ఐ యాం సారీ చీకట్లో మిమ్మల్ని చూసుకోలేదు అంటూ శ్రీనివాస ప్రసాద్ కు మీ భార్యకు చెప్పమని ఎన్టీఆర్ చెప్పారట. ఈ విషయాన్ని విజయశాంతి శత జయంతి సందర్భంగా మరోసారి గుర్తు చేసుకుంటూ ట్విట్ చేసింది.

మరికొన్ని ముఖ్య వార్తలు :

Visitors Are Also Reading