Home » క‌మ‌ల్ హాసన్ చెంప చెళ్లుమ‌నిపించిన సీనియర్ హీరోయిన్‌..!

క‌మ‌ల్ హాసన్ చెంప చెళ్లుమ‌నిపించిన సీనియర్ హీరోయిన్‌..!

by Bunty
Ad

విలక్షణ నటుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఎలాంటి సినిమాలు చేసినా… కచ్చితంగా హిట్ కావాల్సిందే. అలాగే డిఫరెంట్ కథాంశంతో… ప్రేక్షకులకు ముందుకు వచ్చి.. ఎన్నో అద్భుత విజయాలు అందుకున్నారు కమల్ హాసన్. చిత్ర పరిశ్రమలో మంచివి నటుడిగా ఎదగడమే కాకుండా… పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చేశారు కమలహాసన్.

kamal

ఇది ఇలా ఉండగా ఒక సినిమా షూటింగ్ స్పాట్ లో ఓ స్టార్ హీరోయిన్ కమల్ హాసన్ చెంప చెల్లుమనిపించాడట. ఆ హీరో ఎవరో కాదు ఆమని. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హీరోగా శుభ సంకల్పం సినిమా వచ్చింది. అప్పట్లో ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు ప్రేక్షకుల విమర్శకుల…ప్రశంసలు పొందింది. ఈ సినిమాలో కమల్ హాసన్ పక్కన ఆమనీ మరియు ప్రియారామన్ హీరోయిన్లుగా నటించారు. అయితే ఓ సన్నివేశం లో ఆమని.. కమల్ హాసన్ చెంప మీద కొట్టాలి ఉంటుంది. ఆమని.. కమల్ చెంపమీద జస్ట్ టచ్ చేసి వదిలేస్తున్నారు.

Advertisement

Advertisement

ఈ సీన్ కోసం కె.విశ్వనాథ్ ఎన్నో టేకులు తీసుకున్నారట. అయితే చివరికి విశ్వనాధ్ సీరియస్ అవడంతో ఆమని… కమల్ హాసన్ చెంపపై గట్టిగా కొట్టడంతో అప్పుడు షార్ట్ ఓకే అయ్యిందట. ఈ సీన్ కోసం షూటింగ్ అయ్యాక కమల్.. ఆమెని దగ్గరికి వచ్చి…అమ్మ చెంపమీద కొట్టడం అంటే నెమ్మదిగా కొట్టాలి.. కానీ అలా చాచి పెట్టి కొడతారా? అని కమల్ హాసన్ కాస్త సీరియస్ అయ్యారట. దీంతో టెన్షన్లో అలా కొట్టాను సార్… అని సారీ చెప్పిందట హీరోయిన్ ఆమని.

Visitors Are Also Reading