Home » వావ్ అనిపించేలా… సీనియర్ స్టార్ న‌టుల ఫిట్‌నెస్‌…

వావ్ అనిపించేలా… సీనియర్ స్టార్ న‌టుల ఫిట్‌నెస్‌…

by Bunty

సినిమా ప్ర‌పంచంలో నెగ్గుకురావాలి, నెట్టుకురావాలి, విజయం సాధించాలి, ఎక్కువ‌కాలం తెర‌ముందు క‌నిపించాలి అంటే త‌ప్ప‌నిస‌రిగా ఫిట్‌గా ఉండాలి. ఒక‌ప్పుడు బొద్దుగా ఉన్నా, లావుగా ఉన్నా, ఎలా ఉన్న‌ప్ప‌టికీ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. కానీ ఇప్పుడు కాంపిటీష‌న్ పెరిగింది. ఈ కాంపిటీష‌న్ ప్ర‌పంచంలో పోటీని త‌ట్టుకొని నిల‌బ‌డాలి అంటే త‌ప్ప‌నిస‌రిగా ఆక‌ట్టుకునే విధంగా ఫిట్‌గా ఉండాలి.

యంగ్ న‌టీన‌టులకు పోటీగా ధీటుగా న‌టించేందుకు సీనియర్ న‌టులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. వారితో పోటీప‌డుతూ న‌టించాలంటే త‌ప్ప‌నిస‌రిగా ఫిట్‌గా ఉండాలి. ఫిట్‌గా ఉండాలి అంటే వెజ్ ఫుడ్ ఒక్క‌టే మార్గ‌మ‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో చాలామంది స్టార్ న‌టీనటులు వెజ్ ఫుడ్ తీసుకుంటున్నారు. సీనియ‌ర్ న‌టీ ఖుష్బూ కొన్ని నెల‌ల క్రితం 15 కేజీల బ‌రువు త‌గ్గిన‌ట్టు చెప్పింది. కాగా రీసెంట్‌గా మ‌రో ఫొటోను షేర్ చేస్తూ మ‌రో 5 కేజీల బ‌రువు త‌గ్గిన‌ట్టు పేర్కొన్న‌ది. అటు మ‌రో సీనియ‌ర్ న‌టుడు పొన్నియ‌న్ సెల్వ‌న్ సినిమా కోసం బ‌రువు త‌గ్గి ఫిట్‌గా మారిపోయాడు. సినిమాల్లో ఎప్పుడూ లావుగా క‌నిపించే ప్ర‌భు ఒక్క‌సారిగా బ‌రువు త‌గ్గి ఫిట్‌గా మారిపోడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.

Visitors Are Also Reading