Home » ఈ సినిమాలో బాలయ్యని స్క్రీన్ పై చూసి ఒక రేంజ్ లో ఫాన్స్ షాక్ అయ్యారు ! అది మాములు ట్విస్ట్ కాదు

ఈ సినిమాలో బాలయ్యని స్క్రీన్ పై చూసి ఒక రేంజ్ లో ఫాన్స్ షాక్ అయ్యారు ! అది మాములు ట్విస్ట్ కాదు

by Anji
Ad

పనినే దైవంగా భావించి అంకిత భావంతో పని చేసే కొద్ది మంది నటుల్లో నందమూరి బాలకృష్ణ ఒకడు. క్రమశిక్షణ చేస్తున్న పని పట్ల నిబద్ధతలో తండ్రి ఎన్టీఆర్ ని పుణిపుచ్చుకున్న ఆయన జయ, అపజయాలతో సంబంధం లేకుండా సినిమాలను చేసుకుంటూ వెళ్లిపోతారు. అంతేకాదు.. ప్రయోగాలకు ఆయన ఎప్పుడూ సై అంటూనే ఉంటారు. మాస్ కథానాయకుడిగా రాణిస్తున్న సమయంలోనే భైరవధ్వీపం లాంటి జానపద చిత్రాన్ని ఎంచుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం అద్భుతమైన విజయాన్ని అందుకుంది. 

Advertisement

బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఒకవైపు మాస్ హీరోగా, మరో వైపు గ్లామరస్ కథానాయకుడిగా రాణిస్తున్న సమయంలోనే బాలకృష్ణ బైరవద్వీపం సినిమా చేయడం ఒక ఎత్తయితే.. అందులో కురూపిగా నటించడం సాహసమనే చెప్పాలి. అప్పటికే రౌడీ ఇన్ స్పెక్టర్, నిప్పురవ్వ, బంగారు బుల్లోడు వంటి మాస్ కథా చిత్రాలతో దూకుడు మీద ఉన్నారు. ఆ సమయంలోనే బైరవద్వీపం కథతో బాలకృష్ణ వద్దకు వెళ్లితే.. మరో ఆలోచన కూడా చేయకుండా ఓకే చెప్పేశారు. అంతేకాదు.. కథలో భాగంగా కురూపీగా నటించడానికి కూడా ఒప్పుకున్నారు. బాలకృష్ణ కురూపిగా నటించడం నిజంగానే సాహసం అనే చెప్పాలి. బాలయ్యకి దర్శకుడు, కథ పై ఆయనకు నమ్మకం ఎక్కువ. కురూపిగా కనిపించే సన్నివేశాలు తీయాల్సి వచ్చినప్పుడు ఆయనకు మేకప్  వేయడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టేది. ఒకసారి మేకప్ వేసిన తరువాత సాయంత్రం వరకు తీయడానికి వీలులేదు. భోజనం చేయాలంటే.. మేకప్ తీయాలి. తీస్తే.. మళ్లీ రెండు గంటల టైమ్ వేస్ట్.. సమయం వృధా కాకూడదని బాలకృష్ణ దాదాపు 10 రోజుల పాటు కేవలం జ్యూస్ లు మాత్రమే తాగేవాడు.

Advertisement

ఆ తరువాత కురూపి శాపాన్ని కథానాయకుడి తల్లి తీసుకుంటుంది. ఈ విషయాన్ని ఏ.ఆర్.విజయనాయుడిని అడగ్గా.. ఆమె ఇచ్చిన సమాధానం.. హీరోనే కురూపిగా కనిపిస్తుంటే నాకు వేయడానికి ఏమి అభ్యంతరం అని ఆమె కూడా ఆ వేశం వేయడానికి ఒప్పుకుంది. తన శాపం తన తల్లి తీసుకుంటుందని తెలియగానే హీరో పాత్ర కొండలు, రాళ్లు, రప్పలు దాటుకుంటూ రావాలి. అలా బాలకృష్ణ పరుగెత్తుకుంటూ వస్తుంటే.. నీళ్లలో ఉన్న ముల్లు కాలుకి దిగబడ్డాయి. రాళ్లు గుచ్చుకుపోయాయి. అయినా బాలకృష్ణ అవేవి లెక్కచేయలేదు. ఆదిత్య 369 వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు-బాలకృష్ణ కాంబోలో వచ్చిన మూవీ బైరవ ద్వీపం.  ఏప్రిల్ 14, 1994న ఈ సినిమా విడుదల అయింది. ఈ సినిమా ప్రేక్షకులకు అప్పట్లో కొత్త అనుభూతిని అందించి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. బాలకృష్ణ కురూపిగా కనిపిస్తారని థియేటర్ లో సినిమా చూసే వరకు కూడా ఎవ్వరికీ తెలియదు. అభిమానులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అంతేకాదు.. పలు విభాగాల్లో ఏకంగా 9 నంది అవార్డులను సొంతం చేసుకుంది. 

Also Read :  రాజశేఖర్ కారణంగా తన అవకాశాలను కోల్పోయిన శ్రీకాంత్ ఎలాగంటే?

Visitors Are Also Reading