Home » Andhra Pradesh SSC Time Table 2023: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

Andhra Pradesh SSC Time Table 2023: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

by Bunty
Ad

Andhra Pradesh SSC Time Table 2023: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో పరీక్షల కాలం మొదలైంది. అటు ఉద్యోగ పరీక్షలు, ఇటు విద్యార్థులకు వార్షిక పరీక్షలు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ నేపద్యంలోనే వరుసగా పరీక్షల షెడ్యూల్ విడుదలవుతున్నాయి.  అయితే తాజాగా   ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.

Ap SSC exam schedule 2023

Andhra Pradesh SSC Time Table 2023

Andhra Pradesh SSC Time Table 2023

ఈ మేరకు పూర్తి షెడ్యూల్ ను అధికారులు వెల్లడించారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్ష జరగనుంది. రూ. 500 రుసుముతో జనవరి 9 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఆరు పేపర్లతో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు.

Advertisement

Advertisement

మరోవైపు, తెలంగాణలోను పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. పదవ తరగతి బోర్డు పరీక్షలు 6 పేపర్లతోనే నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. పరీక్షకు మూడు గంటల సమయం కేటాయిస్తున్నామన్నారు. పరీక్షలో వ్యాసరూప ప్రశ్నలకు మాత్రమే ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుందని, సూక్ష్మ రూప ప్రశ్నలకు ఛాయిస్ లేదని వెల్లడించారు.

read also : పంత్ కారుకు ప్రమాదం.. విలువైన వస్తువులు, నగలు దొంగిలించిన జనాలు !

Visitors Are Also Reading