Sarkaru Vaari Paata review and rating మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా 2020 లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు మళ్ళీ తెరపై కనిపించలేదు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత సర్కారు వారి పాట సినిమాతో మహేష్ బాబు రెడీ అయ్యారు. దాంతో ఈ సినిమా కోసం అభిమానులు ప్రేక్షకులు ఎంతగానో వేచి చూశారు. పరశురామ్ గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత సర్కారు వారి పాట సినిమాకు దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అదేవిధంగా సినిమా పోస్టర్, ట్రైలర్, పాటలు అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేశారు. ఇక ఎన్నో అంచనాల మధ్య సర్కారు వారి పాట ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది… రెండున్నరేళ్ల గ్యాప్ తర్వాత మహేష్ బాబు ప్రేక్షకులను మెప్పించారా….? దర్శకుడు పరశురామ్ మరో హిట్ అందుకున్నారా..? అన్న సంగతి ఇప్పుడు చూద్దాం.
సినిమా : సర్కారు వారి పాట
Advertisement
నటీనటులు : మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రఖని, వెన్నెల కిషోర్, ప్రభాస్ శ్రీను, నదియా, బ్రహ్మాజీ…. మరికొందరు.
దర్శకత్వం : పరశురామ్
నిర్మాతలు : నవీన్ ఎర్నేని, రవి శంకర్, రామ్
మ్యూజిక్ : ఎస్.ఎస్. తమన్
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
sarkaru vaari paata review and rating
కథ :
సర్కారు వారి పాట కథ విషయానికి వస్తే ఈ సినిమాలో మహేష్ బాబు (మహి) వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. చిన్నతనంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల డబ్బు విషయంలో చాలా జాగ్రత్త గా ఉంటాడు. అమెరికాలో సొంత బ్యాంకు ద్వారా వడ్డీలకి డబ్బులు ఇస్తూ ఆ డబ్బులను తనదైన స్టైల్ లో రాబడుతూ ఉంటాడు. ఈ క్రమంలో కీర్తి సురేష్ (కళావతి )ని చూడగానే మహి ప్రేమలో పడతాడు. అంతేకాకుండా అడిగినన్ని డబ్బులు ఇచ్చేస్తాడు. కానీ కళావతి మాత్రం మహిని మోసం చేస్తుంది. కట్ చేస్తే సముద్రఖని (రాజేంద్రనాథ్) తో గొడవ జరుగుతుంది. మహి తన డబ్బులు ఎలా రాబట్టు కుంటాడు… మహి తండ్రితో రాజేంద్రనాథ్ కు ఉన్న సంబంధం ఏంటి. మహి చిన్న వయసులో ఏం జరిగింది. అసలు మహి తండ్రి ఒక్క రూపాయి తీసుకుని దూరంగా వెళ్లిపోవడం వెనక ఉన్న కథేంటి అన్నదే ఈ సినిమా.
Advertisement
విశ్లేషణ :
సినిమా కథ పరంగా కాస్త రొటీన్ గా అనిపించినా వినోదం పరంగా ఎక్కడ తగ్గలేదు. సినిమా ఫస్ట్ హాఫ్ లో రెండు పాటలు ఒక ఫైట్ కామెడీతో సాగిపోతుంది. ఫస్టాఫ్ లో వెన్నెల కిషోర్ తో ఉండే కామెడీ సన్నివేశాలు నవ్వులు పూస్తాయి. సెకండాఫ్ లో ప్రభాస్ శీను కామెడీ ఆకట్టుకుంటుంది. మహేష్ బాబు పర్ఫామెన్స్ ఓవరాల్ సినిమా మొత్తం అదిరిపోతుంది. సినిమాలో పరశురామ్ సరికొత్త మహేష్ బాబు ను చూపించాడు. కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ ఇలా అన్ని కలిపి పక్కా కమర్షియల్ సినిమా చూపించాడు పరశురామ్. సినిమా విడుదలకు ముందే పాటలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఆడియో వీడియో కూడా థియేటర్లలో దుమ్ము లేచి పోతుంది. ఆద్యంతం సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా ఉండడంతో పాటు కొన్ని సీన్లు విజిల్స్ కొట్టిస్తాయి. కీర్తి సురేష్ అందచందాలతో ఆకట్టుకుంటుంది. అదేవిధంగా సముద్రఖని తనదైన విలనిజంతో భయపడతాడు. సినిమాలో ఫైట్లు దుమ్ము లేచి పోయాయి. ఓవరాల్ గా పరశురామ్ సర్కారు వారి పాట తో మహేష్ బాబు ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్ ఇచ్చారు.
ప్లస్ లు, మైనస్ లు :
సినిమాకు మహేష్ బాబు, కీర్తి సురేష్, యాక్షన్ సన్నివేశాలు, కామెడీ, పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ గా నిలిచాయి.
సినిమాలో సెకండాఫ్ కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. అంతే కాకుండా కథ పరంగా కొత్తగా ఏమీ లేదనే భావన కలుగుతుంది. సినిమాకు ఎడిటింగ్ కూడా కొంతవరకు మైనస్ అయినట్టు అనిపిస్తుంది. ఇంటర్వెల్ ఎక్కడ పెట్టాలో దర్శకుడు కన్ఫ్యూజన్ అయినట్టు అనిపిస్తుంది.
ALSO READ :
ఇంటర్ పరీక్షల్లో ఎన్టీఆర్ పై ప్రశ్నలు…సోషల్ మీడియాలో వైరల్….!
సమంత పర్సనల్ లైఫ్ పై లేడీ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు…!