Home » సర్కారు వారి పాట సినిమాలో సితార పాత్ర అదేనా…!

సర్కారు వారి పాట సినిమాలో సితార పాత్ర అదేనా…!

by AJAY
Ad

ప్రిన్స్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ కు జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి పోస్టర్ మరియు ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేయగా ఎంతగానో ఆకట్టుకుంది.

Advertisement

ఇదిలా ఉంటే రీసెంట్ గా. ఈచిత్రం నుండి ఓ పాటను రిలీజ్ చేశారు. కాగా ఆ పాటలో కీర్తి సురేష్ తో పాటు మహేష్ బాబు కూతురు సితార కూడా స్టెప్పులు వేస్తూ కనిపించింది. సితార క్యూట్ స్టెప్పులు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అయితే సితార కేవలం పాట లో మాత్రమే కనిపిస్తుందా లేదంటే సినిమాలో కూడా నటించిందా అనే అనుమానాలు షురూ అయ్యాయి. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించిన సమయం లో కూడా సితార సినిమాలో నటిస్తోంది అని వార్తలు వినిపించాయి.

Advertisement

కానీ ఆ వార్తలను కొంతమంది కొట్టి పారేశారు. అయితే తాజాగా పాటలో సితార కనిపించడం తో కేవలం పాట కోసం సితరను తీసుకొని ఉండరని….మహేష్ బాబు సితార మధ్య కొన్ని సీన్లు ఉండే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు. అయితే సితార సినిమాలో నటించిందా లేదంటే కేవలం పాట లో కనిపిస్తుందా అన్నది తెలియాలి అంతే ట్రైలర్ లేదా టీజర్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.

Visitors Are Also Reading