టాలీవుడ్ సూపర్ మహేష్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల విడుదలైన సర్కారు వారి పాట ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ షేక్ చేస్తోంది. ముఖ్యంగా మహేష్ క్యారెక్టరైజేషన్ కేక పెట్టించే విధంగా ఉన్నది. ట్రైలర్‌లో చెప్పిన డైలాగ్‌లు, కామెడి టైమింగ్, యాక్షన్ సీన్లతో అదరగొట్టేశాడు.
Advertisement
ఇదిలా ఉండగా.. ఈ సినిమాకు సంబంధించిన కథ లీకు అయింది. దర్శకుడు పరశురామ్ సింపుల్ స్టోరీని పవర్‌ఫుల్‌గా ప్రజెంట్ చేయబోతున్నారట. ముఖ్యంగా సర్కారు వారి పాట అప్పు, డబ్బు చుట్టూ తిరుగుతుందట. మహేష్ ఫారెన్‌లో ఉంటూ అప్పులు ఇస్తుంటాడట. అప్పుతీసుకున్న వారి నుంచి ఎలాగైనా వసూలు చేస్తుంటాడు. ఈ తరుణంలో హీరోయిన్ పరిచయమవుతుంది. మహేష్ దగ్గర అప్పు తీసుకుంటుంది. అకస్మాత్తుగా హీరోయిన్‌తో కలిసి మహేష్ భారత్‌కు వస్తాడు. మహేష్‌బాబు తన అసలైన ఆపరేషన్ ప్రారంభిస్తాడు9. పోకిరి తరహాలో విలన్ గ్యాంగ్‌లో చేరుతాడు. వాళ్లకు అప్పు ఇస్తూ కావాల్సిన పని చేసే పెడతాడు. ఘరానా మోసాలు చేసే సముద్ర ఖనికి మహేష్‌కు ఓ సందర్భంలో బెడిసికొడుతుంది.
Advertisement
మహేష్ విలన్ గ్యాంగ్‌లో ఎందుకు చేరాల్సి వచ్చిందనేది కథలో పెద్ద ట్విస్ట్. మహేష్ బాబుకు ఈ చిత్రంలో తన తండ్రి రూపంలో ప్లాష్‌బ్యాక్ కూడా ఉంటుందట. మహేష్ తండ్రి అప్పులు ఎక్కువగా ఇచ్చి మోసపోయి ఉండవచ్చు. ఫ్యామిలీ వీధిన పడ్డప్పుడు ఊహించని విషాదం జరుగుతుంది. తన తండ్రికి జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని మహేష్ డబ్బు విషయంలో రాటుదేలుతాడు. ఎంతటివారి నుంచైనా వడ్డీతో సహా వసూలు చేస్తాడు. అప్పు అనేది ఆడపిల్ల తండ్రి లాంటిదని.. ఎంతో బాధ్యతగా ఉండాలనే డైలాగ్‌లు ట్రైలర్‌లో వినిపించేది. ఇక్కడ ఎవ్వడూ బాధ్యతగా లేడని మహేష్ చెబుతాడు.
అసలు మహేష్ తండ్రి ఎవరు..? ఆయన ఎలా మోసపోయారు..? తన తండ్రికి జరిగిన అన్యాయానికి రివేంజ్ మహేష్ ఎలా తీర్చుకున్నాడనేది అసలు కథ. ముఖ్యంగా దర్శకుడు పరశురామ్ సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా సినిమా తీసినట్టు తెలుస్తోంది. అప్పు విషయంలో బాధ్యతగా ఉండాలి అని చెప్పడం వెనుక కారణం బ్యాంకులకు వేల కోట్లు అప్పులు ఎగవేసిన విజయ్ మాల్యా లాంటి వారి సంఘటనలు అయి ఉండవచ్చు. మహేష్ నుంచి అవుట్ పుట్‌ను అద్భుతంగా రాబట్టినట్టు తెలుస్తోంది. మహేష్ పాత్రలో ఫన్‌తో పాటు ఎమోషనల్ డెప్త్ కూడా ఉన్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా ఏవిధంగా తెలియాలంటే మాత్రం మే 12 వరకు వేచి చూడక తప్పదు.
Also Read :
“ఆచార్య” సినిమా నష్టాలని విజయదేవరకొండ భర్తీ చేయనున్నాడా.. ఎలాగంటే..?
చిరు చేసిన ఆ పని వల్లే సినిమా పరాజయాన్ని మూటకట్టుకుందా.. ? కొరటాల తప్పు లేదా. ?