సోషల్ మీడియా లో సెలబ్రిటీ అయ్యేందుకు చాలామంది తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే వారిలో కొంతమంది మాత్రమే సెలబ్రిటీలు అవుతారు. సోషల్ మీడియా సెలబ్రిటీ స్టేటస్ కోసం వింత వింత పనులు చేస్తూ ఉంటారు. తాజాగా ఓ మహిళ చేసిన ప్రయత్నం తెగ వైరల్ అవుతోంది. భారతదేశంలో చీరలు కట్టుకోవడం సాంప్రదాయం అన్న సంగతి తెలిసిందే. సాధారణంగా అయితే చీరలను కాటన్ లేదా పట్టు బట్టలతో తయారు చేస్తారు. కానీ ఇక్కడ ఓ యువతి చిప్స్ ప్యాకెట్ కవర్లతో చీరను తయారు చేసింది. అంతేకాకుండా చిప్స్ ప్యాకెట్ ను చూపిస్తూ వెంటనే ఆ చీర కట్టుకొని వచ్చింది.
Advertisement
Advertisement
చిప్స్ ప్యాకెట్ కవర్లతో చీర కట్టుకొని వీడియో కు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్ లో వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ వీడియోకు లక్షకుపైగా వ్యూవ్స్ కూడా వచ్చాయి. అయితే నిజంగా చిప్స్ ప్యాకెట్ కవర్ తో యువతి చీర కట్టిందా లేదంటే క్లాత్ తో కట్టుకుందా అని ఆశ్చర్యపోతున్నారు. ఇక వీడియో చూసి ఆశ్చర్య పోయిన వారు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. వామ్మో ఇన్ని ప్యాకెట్లు ఎక్కడ జమ చేశారు అని కామెంట్ పెట్టగా…. మరో నెటిజన్ మీ భర్త చాలా లక్కీ…కాస్లి చీరలు కొనాల్సిన అవసరం లేదు. అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
In an Instagram video a girl has made a saree out of potato chips wrappers. The video has garnered 141k views leaving the viewers confused if this is too genius or bizarre to be true.#ViralVideo #Saree pic.twitter.com/wr6cSQDdHo
— TIMES NOW (@TimesNow) February 8, 2022