Home » శాకుంతలం మూవీలో సమంత కట్టుకున్న చీర, నగల ధర ఎంతంటే..?

శాకుంతలం మూవీలో సమంత కట్టుకున్న చీర, నగల ధర ఎంతంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరుపొందింది సమంత. ప్రస్తుతం ఈమె శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టారు చిత్ర యూనిట్. అయితే తాజాగా శాకుంతలం మూవీలో సమంత ధరించిన చీర నగల ధర వైరల్ గా మారింది. మరి ఆ విశేషాలు ఏంటో చూద్దాం.. పౌరాణిక నేపథ్యంలో సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా  శాకుంతలం..

Advertisement

గుణశేఖర్ డైరెక్షన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకేక్కిన ఈ మూవీని నీలిమ గుణ, దిల్ రాజ్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 17వ తేదీన తమిళ, కన్నడ,హిందీ,మలయాళ భాషల్లో విడుదలవుతున్న విషయం అందరికీ తెలిసిందే. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఎపిక్ ఫిల్మ్ మేకర్ గుణశేఖర్ రూపొందించిన పౌరాణిక ప్రేమ కావ్యం శాకుంతలం. ఈ మూవీ ప్రమోషన్స్ పెద్ద ఎత్తున సాగుతున్నాయి.

Advertisement

అందులో భాగంగా విడుదలైన మూవీ ట్రైలర్ మల్లిక మల్లిక సాంగ్ సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు శాకుంతలంలో సమంత డ్రెస్సింగ్ నగలపై ఒక టాక్ బయటకు వచ్చింది. ఆమె ధరించిన నగర ధర ఏకంగా 93 కోట్ల రూపాయలని తెలుస్తోంది. అలాగే 30 కిలోల బరువు ఉండే శారీ కట్టుకోగా, ఆ చీరతో ఏడు రోజులపాటు సమంతను షూట్ చేశారట. ప్రస్తుతం వీటి గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి.

also read:

Visitors Are Also Reading