తెలుగు, తమిళ, మలయాళ ఇండస్ట్రీలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శరత్ బాబు. అలాంటి ఆయన అనారోగ్య కారణంతో మరణించడం ఇండస్ట్రీకి తీరని శోకంగా మారింది. అలాంటి శరత్ బాబు అంత్యక్రియల తర్వాత కొన్ని వాస్తవాలు బయటకు వచ్చాయి. అదేంటో ఇప్పుడు చూద్దాం.. అయితే శరత్ బాబు 250 పైగా చిత్రాల్లో నటించారు. ఇందులో 70 సినిమాల్లో హీరోగా నటించి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు.
Advertisement
అలాంటి ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకేమీ ఇబ్బందులు లేవని తెలియజేశారు. కానీ ఆయనకు ఆ ఒక్క కోరిక మాత్రం అస్సలు తీరలేదు.. అది తీరకుండానే అనారోగ్యం కారణంగా మరణించడంతో ఆయన ఆస్తుల విషయంలో అనేక గొడవలు జరుగుతున్నాయి. ఇంతకీ ఆయన కోరిక ఏంటయ్యా అంటే .. శరత్ బాబు తన విశ్రాంతి జీవితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఊటీగా పేరుపొందిన ఆర్సిలిహిల్స్ లో గడపాలనుకున్నారట. అక్కడ ఇల్లు కట్టుకొని ఉండాలనుకున్నారట. చిత్తూరు జిల్లాలోని మదనపల్లి పట్టణానికి 29 కిలోమీటర్ల ఆర్సిలిహిల్స్ లో ఇల్లు కట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారట.
Advertisement
అయితే ఇదే విషయాన్ని తన డైరీలో రాసుకున్నట్టు తెలుస్తోంది. ఈయనకు ఆ ప్రాంతంలో ఎప్పటినుంచో స్థలం ఉంది. 1985 లోనే ఇల్లు కట్టాలని స్టార్ట్ చేసి కొంతకాలంకి నిర్మాణం ఆపేశారు. ఇలా కోరిక తీరకముందే ఆయన మరణించడం బాధాకరం. మూడు వివాహాలు చేసుకున్న శరత్ బాబుకు పిల్లలు పుట్టలేదు. దీంతో ఆయనకున్న కోట్లాది ఆస్తులను 13 భాగాలు చేసి తన బంధువులందరికీ రాసి ఇవ్వాలని అనుకున్నారట. ఈ విధంగా తాను అనుకున్నవి ఏవి కూడా నెరవేరకముందే ఆయన మరణించడం సినీ ఇండస్ట్రీని కలచివేస్తోంది.
మరికొన్ని ముఖ్య వార్తలు :
- జయం సినిమాలో షకీలాను దర్శకుడు తేజ ఎంపిక చేయడానికి కారణం ఏంటో తెలుసా ?
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారు ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకూడదు..!
- టీడీపీ మెనిఫెస్టో.. చంద్రబాబు 6 ప్రధాన హామీలు ఇవే..!