తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు సాధించిన శరత్ బాబు హీరోగా..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా… విలన్ గా..ఎన్నో పాత్రల్లో చేసి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ్, కన్నడ చిత్ర పరిశ్రమల్లో కూడా ఆయన నటించారు. సుమారు 2000 పైగా చిత్రాల్లో నటించిన శరత్ బాబు ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతారు.. ఈయన అసలు పేరు సత్యనారాయణ. 1951 జూలై 31న ఆంధ్రప్రదేశ్లోని ఆముదాలవలసలో ఆయన జన్మించారు.
also read:
Advertisement
1973లో రామరాజ్యం అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన శరత్ బాబు ఆ తర్వాత కన్నడ చిత్రంలో నటించారు. దీని తర్వాత సింగీతం శ్రీనివాస్ డైరెక్షన్లో పంతులమ్మ అనే సినిమా చేశారు. ఆ తర్వాత అమెరికా అమ్మాయి, చిలకమ్మ చెప్పింది సినిమాలు చేశాడు. 1981 నుంచి 83 వరకు మూడుసార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు. సీతాకోకచిలుక, నీరాజనం, ఓ భార్య కథ వంటి సినిమాలకు కూడా అవార్డులు వచ్చాయి.
Advertisement
అలాంటి శరత్ బాబు తన సినిమా కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో నాలుగు సంవత్సరాలు పెద్దదైన రమాప్రభను ప్రేమించి వివాహం చేసుకున్నారు. అలా 14 సంవత్సరాలు వీరి వైవాహక జీవితం బాగానే ఉన్నా ఆ తర్వాత విడాకులు తీసుకొని దూరమైపోయారు.ప్రస్తుతం శరత్ బాబు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆసుపత్రిలో చేరారు. ఈ తరుణంలో ఆయన చనిపోయాడంటూ అనేక వార్తలు తప్పుగా వస్తున్నాయి. ఆయన కొంచెం రికవరీ అయ్యారు. ఇప్పుడే రూమ్ కి షిఫ్ట్ చేశాం. ఆయన తొందరలోనే కోలుకొని మీడియాతో మాట్లాడతారని ఆశిస్తున్నాను అంటూ శరత్ బాబు సోదరి అంటోంది. ఆయన చనిపోయిన వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. అవి నమ్మవద్దు అంటూ అభిమానులకు విజ్ఞప్తి చేసింది.
also read:ఎన్టీఆర్ సినిమాకెళ్లి చిరంజీవి దెబ్బలు తిన్నాడనే విషయం తెలుసా ?