Ad
భారత ఆటగాళ్లలో సంజూ శాంసన్ కు అలాగే రిషబ్ పంత్ కు సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఉంది. అయితే టీం ఇండియా మాజీ కెప్టెన్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని తర్వాత జట్టుకు వికెట్ కీపర్ ఎవరు అనే వాదన వచ్చినప్పుడు సంజూ, పంత్ పేర్లు బాగా వినిపించేవి. కానీ బీసీసీఐ సెలక్టర్లు మాత్రం పంత్ కే ఎక్కువ అవకాశాలు ఇచ్చేవారు. సంజూ ఒక్క మ్యాచ్ లో విఫలం అవ్వడంతోనే అతడిని తీసి జట్టు నుండి పక్కన పెట్టేవారు. కానీ పంత్ అలా ఎన్నిసార్లు విఫలం అయినా కూడా యువ ఆటగాడు అంటూ వెనుకేసుకొచ్చేవారు. ఈ వాగ్వాదాహ్మ్ అనేది ఇప్పటి కూడా జరుగుతూనే ఉంది.
ఇక ప్రస్తుతం టీం ఇండియా వెస్టిండీస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటన నుండి సీనియర్ ఆటగాళ్లతో పాటుగా పంత్ కు కూడా విశ్రాంతి ఇచ్చారు సెలక్టర్లు. అందువల్ల సంజూ శాంసన్ కు జట్టులో అవకాశం అనేది వచ్చింది. ఇక ఈరోజు ఈ రెండు జట్ల మధ్య రెండో వన్డే అనేది జరుగుతుంది. ఇక మొన్న జారొగిన మొదటి వన్డేలో తుది జట్టులో ఉన్న సంజూ.. కీపింగ్ లో అదరగొట్టినా.. బ్యాటింగ్ లో మాత్రం విఫలమయ్యాడు. కేవలం 12 పరుగులే చేసాడు. అయినా కూడా ఎవరు సంజూని వ్యతిరేకించలేదు. కానీ తాజాగా పాకిస్థాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా మాత్రం సంజూ కంటే పంత్ బెస్ట్ అని కామెంట్స్ చేసాడు.
కనేరియా మాట్లాడుతూ… సంజూ ఇప్పుడు మరో అవకాశం వెస్ట్ చేసుకున్నాడు. పరుగులు చేయకపోయినా బ్యాటింగ్ లో ఒక ఊపు అనేది ఉంటె చూడాలనిపిస్తుంది. కానీ ఈ మ్యాచ్ లో సంజూ చాల నీరసంగా కనిపించాడు. అయితే పంత్ బ్యాటింగ్ లో ఒక్క యాటిట్యూడ్ అనేది ఉంటుంది. కానీ సంజూలో అంది ఉండదు. అందుకే ఎప్పుడు సంజూ శాంసన్ రిషబ్ పంత్ కాలేడు అని కామెంట్స్ చేసాడు. మరి ఈరోజు విండీస్ తో జరుగుతున్న రెండో వన్డేలోనైనా సంజూ పరుగులు చేయాలి అని అభిమానులు కోరుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
ఇవి కూడా చదవండి :
మళ్ళీ నోరు జారిన రమీజ్ రాజా… ఆడుకుంటున్న ఫ్యాన్స్…!
నా లక్ష్యం అదే… క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ..!
Advertisement