Home » శ్రీ లీలను తొక్కేస్తున్న సంయుక్త మీనన్….!

శ్రీ లీలను తొక్కేస్తున్న సంయుక్త మీనన్….!

by Bunty
Ad

స్టార్ హీరోయిన్ శ్రీ లీల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అందం, నటన, అమాయకత్వం, డ్యాన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది ఈ బ్యూటీ. ‘పెళ్లి సందD’ సినిమాతో టాలీవుడ్ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటూ టాప్ హీరోలు అందరి సరసన నటించే ఛాన్స్ కొట్టేస్తుంది. తాను నటించిన ప్రతి ఒక్క సినిమా కూడా బంపర్ హిట్ కావడంతో డైరెక్టర్స్ కూడా ఈ అమ్మడు డేట్స్ కోసం క్యూ కడుతున్నారు.

Advertisement

అయితే తాజాగా శ్రీ లీల కు పోటీగా వరుస సినిమాలతో దూసుకుపోతోంది సంయుక్త మీనన్. తమిళ్, మలయాళం సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ అమ్మడు తెలుగులో నటించెందుకు ఆసక్తి చూపిస్తోంది. సంయుక్త నటించిన మొదటి సినిమా… ధనుష్ సరసన ‘సార్’ సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా సక్సెస్ లో ఉండగానే ‘విరూపాక్ష’ మూవీలో నటించి ప్రేక్షకులకు మరింత చేరువైంది ఈ అమ్మడు.

Advertisement

అయితే రానున్న రోజుల్లో శ్రీ లీలకు, సంయుక్త మీనన్ కు మధ్య టఫ్ కాంపిటేషన్ ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీ లీల అంతా అందంగా సంయుక్త మీనన్ లేనప్పటికీ తన నటనతో ప్రేక్షకులను సంపాదించుకుంటుంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ పరిశ్రమకు వీరిద్దరే టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. రానున్న రోజుల్లో వీరిద్దరి మధ్య పోటీ ఏ విధంగా ఉండబోతుందో చూడాలి మరి.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

ప్రభాస్ – అనుష్క పెళ్లికి అడ్డుపడింది ఎవరు..?

ప్రభాస్ కెరియర్ లోనే లిప్ లాక్ ఇచ్చిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా…!

కన్నీళ్లు తెప్పిస్తున్న సౌందర్య చివరి మాటలు…!

Visitors Are Also Reading