Telugu News » Blog » సాయి ధరమ్ తేజ్ పై సంయుక్త మీనన్ సీరియస్ !

సాయి ధరమ్ తేజ్ పై సంయుక్త మీనన్ సీరియస్ !

by Bunty
Ads

బైక్ ఆక్సిడెంట్ తర్వాత ఆ సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం విరూపాక్ష. తేజ్ ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత నటిస్తున్న తొలి చిత్రం ఇదే. టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. కార్తిక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తేజ్ కు జోడిగా సంయుక్త మీనన్ నటిస్తోంది. బ్లాక్ మ్యాజిక్ వంటి ఇంట్రెస్టింగ్ కథాంశంతో ఈ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. సినిమా కథ ఏంటి అన్న దానిపై అందరిలో క్యూరియాసిటీ పెంచేసింది మూవీ. అయితే తాజాగా ఈ సినిమా యూనిట్ పై సంయుక్త సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యింది.

Advertisement

READ ALSO : తండ్రి మరణంతో ఒంటరైన అమ్మ… తల్లికి మళ్లీ పెళ్లి చేసిన కొడుకులు

Advertisement

ఉగాది రోజున విరూపాక్షలో తన పోస్టర్ విడుదల చేస్తామని చెప్పి చేయనందుకు ఏకంగా చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ కు ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసింది. చిత్ర యూనిట్ బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదంటూ మండిపడింది. “నేను చాలా డిసప్పాయింట్ గా ఉన్న, నా బాధను వ్యక్తం చేసే ముందు విరూపాక్షలో నా ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగిందని చెప్పాలనుకుంటున్నాను. అమేజింగ్ యాక్టర్స్, టెక్నీషియన్స్ తో పనిచేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.

READ ALSO : మంచు కుటుంబంలో కొత్త కోడలు హవా… అందరిని తొక్కేస్తోందా?

Samyuktha Menon : పలుచని చీరలో పరువాలు ఒలకబోసిన టాలీవుడ్ కొత్త అందం సంయుక్తా.. Samyuktha menon looks gorgeous in dhanush sir trailer release event pics goes viral– News18 Telugu

ఈ జ్ఞాపకాలు అన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా. కానీ, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ ఎందుకు ఇంత బాధ్యతారహిత్యంగా ఉంది? నా క్యారెక్టర్ పోస్టర్ ని ఉగాది రోజు రిలీజ్ చేస్తానని మాట ఇచ్చారు. ఎక్కడ రిలీజ్ చేశారు? ఆ పోస్టర్ ఏది?” అంటూ ఆ సంస్థ ట్యాగ్ చేస్తూ ప్రశ్నించింది. దీంతో వెంటనే స్పందించిన నిర్మాణ సంస్థ సంయుక్తని క్షమాపణలు కోరింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు పోస్టర్ రిలీజ్ చేసేందుకు కొంత సమయం కావాలని సంయుక్తకి రిప్లై ఇచ్చారు.

Advertisement

READ ALSO : రెండో పెళ్లికి రెడీ అయిపోయిన నిహారిక…?

You may also like