Home » ఇండ‌స్ట్రీలో నాకు లైన్ వేశారు…కానీ అందుకే ఓకే చెప్పలేదు : సంప‌త్ రాజ్

ఇండ‌స్ట్రీలో నాకు లైన్ వేశారు…కానీ అందుకే ఓకే చెప్పలేదు : సంప‌త్ రాజ్

by AJAY

మిర్చి విల‌న్ సంప‌త్ రాజ్ ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. మిర్చి సినిమా త‌ర‌వాత సంప‌త్ రాజ్ వ‌రుస అవ‌కాశాలు ద‌క్కించుకున్నాడు. త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు. ప్ర‌స్తుతం ప‌లు భారీ ప్రాజెక్ట్ ల‌లో ప‌నిచేస్తున్నాడు. అయితే సంప‌త్ రాజ్ ఓ ఇంట‌ర్య్వూలో త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు. త‌న‌కు ఇప్ప‌టికే పెళ్లైపోయింద‌ని విడాకులు కూడా అయ్యాయ‌ని చెప్పారు.

sampath raj

sampath raj

త‌న‌కు ఒక కూతురు ఉంద‌ని త‌న భార్య మ‌ళ్లీ పెళ్లి చేసుకుంద‌ని వెల్లడించారు. అంతే కాకుండా త‌న కూతురు త‌న వ‌ద్దే ఉంటుందని చెప్పారు. ఇక త‌న‌కు విడాకులు జ‌రిగిన విష‌యం తెలిసి సింగిల్ అనే విష‌యం తెలిసి కొంత మంది త‌న‌ను ట్రై చేశార‌ని…పెళ్లి ప్ర‌పోజ‌ల్స్ వ‌చ్చాయ‌ని అన్నారు. కానీ త‌నకు కూతురు ముఖ్య అని త‌న గోల్స్ వేరే ఉన్నాయ‌ని అందువ‌ల్లే ఒప్పుకోలేద‌ని చెప్పారు.

అంతే కాకుండా ఓ మ‌హిళ‌తో ప‌రిచ‌యం అయ్యింద‌ని ఆమెకు కూడా విడాకులు అయ్యాయ‌ని త‌న‌తో వ్య‌వ‌హారం పెళ్లి వ‌ర‌కూ వెల్లింద‌ని కానీ ఏదో ఒక ద‌గ్గ‌ర న‌చ్చ‌క‌పోవ‌డంతో ఆ పెళ్లి కాస్తా క్యాన్సిల్ అయ్యింద‌ని చెప్పారు. ఇక పై తాను పెళ్లి చేసుకోన‌ని సింగిల్ గానే ఉంటాన‌ని చెప్పారు. అంతే కాకుండా త‌న‌కు రెండు సినిమాల‌కు ద‌ర్శ‌కత్వం కూడా వ‌హించాల‌నే కోరిక ఉంద‌ని చెప్పారు.

Visitors Are Also Reading