Home » అనారోగ్యంతో పాటూ ఆ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న స‌మంత‌..? ప్ర‌స్తుతం ఎక్క‌డ ఉందంటే..?

అనారోగ్యంతో పాటూ ఆ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న స‌మంత‌..? ప్ర‌స్తుతం ఎక్క‌డ ఉందంటే..?

by AJAY

కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నా ఆరోగ్యం మనశ్శాంతి లేకపోతే వృథానే. కోటీశ్వరులే కాకుండా సెలబ్రిటీల‌ విషయంలోనూ ఇది నిజమనే చెప్పాలి. ఇప్పుడు సమంత కూడా మనశ్శాంతి కోసం అనేక తంటాలు పడుతోందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. సమంత హీరో నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

Samantha nagachaitanya

Samantha nagachaitanya

విడాకుల త‌ర‌వాత సమంత బయటకు చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నప్పటికీ ఎంతో మనోవేదనను అనుభవిస్తున్నట్టు తెలుస్తోంది. దానికి తోడు సమంతకు చర్మ సమస్యలు వచ్చాయని కొన్ని వార్తలు మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అంతే కాకుండా సమంత కొంతకాలంగా సినిమా షూటింగ్లకు కూడా దూరంగా ఉంటోంది.

సోషల్ మీడియాలోనూ సమంత పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు. ఇక చ‌ర్మ స‌మ‌స్య‌ల వైద్యం కోసం కొద్దిరోజుల పాటు సమంత అమెరికాలో చికిత్స తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక అమెరికా నుంచి వచ్చిన తర్వాత కూడా సమంత హైదరాబాదులో ఉండటం లేదు. షూటింగ్ ల‌లో పాల్గొన‌టం లేదు. అయితే విశ్వస‌నీయ వర్గాల సమాచారం మేరకు సమంత ప్రస్తుతం కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లో ఉంటున్నట్టు తెలుస్తోంది.

అక్కడ చర్మ సమస్యలను నాచురల్ గా తగ్గించే కొనేందుకు సమంత ప్రయత్నాలు చేస్తుంద‌ని సమాచారం. అంతేకాకుండా మానసిక ప్రశాంతత కోసం ఈనెల 10వ తేదీ వరకు సమంత అక్కడే ఉండాలని నిర్ణయం తీసుకుంది అంటూ టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు…. కానీ ప్రస్తుతం సమంత నటిస్తున్న సినిమా షూటింగ్ ల‌న్నీ ఆపేశారు. ఇక ప్ర‌స్తుతం స‌మంత శాకుంత‌లం తో పాటూ కుషి సినిమాల‌లో న‌టిస్తోంది.

Visitors Are Also Reading