ఏ మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సమంత. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది. అంతేకాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీ అయినా అక్కినేని ఇంటికి కోడలుగా వెళ్లి నాగచైతన్య తో కొన్ని రోజులు కాపురం చేశాక ఇద్దరి మధ్య ఏవో మనస్పర్ధలు తలెత్తి విడాకులు తీసుకున్నారు. ఇక విడాకుల తర్వాత సమంతను చాలామంది సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. కానీ సమంత మాత్రం తన మీద వస్తున్న ఏ విషయాలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతుంది.
Advertisement
also read;పెళ్లి చేసుకున్న కొద్ది గంటల్లోనే హాలీవుడ్ సింగర్ మృతి.. అసలు ఏం జరిగిందంటే ?
Advertisement
విడాకుల తర్వాత సమంత సినిమాల పరంగా మరింత జోరు పెంచింది. అంతేకాదు పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.అయితే ఈ విషయం పక్కన పెడితే సమంత ఈ మధ్యనే తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తనకు అరుదైన వ్యాధి వచ్చింది అంటూ పోస్ట్ చేసింది. అయితే సమంతకు ఉన్న వ్యాధి గురించి తెలిసి చాలామంది సెలబ్రిటీలు, అభిమానులు పెద్ద ఎత్తున ఆమె త్వరగా ఆ వ్యాధి నుండి బయట పడాలని దేవున్ని ప్రార్థించారు. అయితే సమంతకు ఉన్న వ్యాధి బయటపడ్డ తర్వాత సమంత మీద ఎన్నో వార్తలు వస్తున్నాయి. తాజాగా సమంత ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని మెరుగైన చికిత్స కోసం దక్షిణ కొరియాకి ఆమెను తరలించారు అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి.
ఇక సమంత ఆరోగ్య పరిస్థితి అంత క్రిటికల్ గా ఉందా అంటూ ఆమె అభిమానులు బాధపడుతున్నారు. అయితే ఈ విషయం పెద్ద ఎత్తున వైరల్ అవ్వడంతో ఈ వార్తలపై సమంత టీం స్పందించినట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ మీడియా ఛానల్ సమంత ఆరోగ్యం ఎలా ఉంది అని సమంత టీం ని ప్రశ్నించగా.. సమంత విషయంలో వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవాలే. ఆమె ట్రీట్మెంట్ కోసం ఎక్కడికి వెళ్ళలేదు. ప్రస్తుతం సమంత హైదరాబాదులోని తన ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంది అంటూ సమంత ఆరోగ్యం పై వస్తున్న వార్తలను కొట్టి పారేసింది సమంత టీం. ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు.
also read;భార్య ఉండగానే మరొకరితో ప్రేమలో పడ్డ 6 స్టార్ నటులు !