Telugu News » Blog » చికిత్స కోసం ద‌క్షిణ కొరియాకు స‌మంత‌..ఆరోగ్యం పై అప్డేట్ ఇచ్చిన ఆమె మేనేజ‌ర్..!

చికిత్స కోసం ద‌క్షిణ కొరియాకు స‌మంత‌..ఆరోగ్యం పై అప్డేట్ ఇచ్చిన ఆమె మేనేజ‌ర్..!

by AJAY
Ads

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ప్ర‌స్తుతం మ‌యోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. స‌మంత నాగ‌చైత‌న్య‌తో విడాకుల త‌ర‌వాత చాలా కాలం పాటూ డిప్రెషన్ లోకి వెళ్లినట్టు ఇంట‌ర్వ్యూల‌లో వెల్ల‌డించింది. అంతే కాకుండా విడాకుల‌కు అస‌లు కార‌ణం మాత్రం స‌మంత ఇప్ప‌టి వ‌ర‌కూ వెల్ల‌డించలేదు. కానీ స‌మంత చైతూ ఇద్ద‌రూ విడాకుల త‌ర‌వాత సినిమాల‌తో ఫుల్ బిజీగా మారిపోయారు.

Advertisement

టాలీవుడ్ తో పాటూ బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తున్నారు. అలా ఇద్ద‌రూ బిజీ అవ్వ‌డంతో అంతా వీరి విడాకుల వార్త‌ల‌ను మ‌ర్చిపోయారు. కానీ అలాంటి స‌మ‌యంలోనే స‌మంత మ‌యోసైటిస్ బారిన ప‌డ‌టం అభిమానుల‌ను ఆందోళ‌నకు గురి చేసింది. మ‌యోసైటిస్ అరుదైన వ్యాధి దాని బారిన ప‌డిన‌వాళ్ల‌కు కండ‌రాల నొప్పులు తీవ్రంగా ఉంటాయి.

Advertisement

ఇక స‌మంత కూడా చాలా కొన్ని సార్ల మరో అడుగు కూడా వేయ‌లేనేమో అని బాధ‌ప‌డిన‌ట్టు వెల్ల‌డించింది. ఇక స‌మంత అనారోగ్యం బారిన ప‌డిన నాటి నుండి ఆమెకు సంబంధించిన అనేక వార్త‌లు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతూనే ఉన్నాయి. రీసెంగా మ‌రోవార్త వైర‌ల్ అవుతోంది. స‌మంత ఇప్ప‌టికే అమెరికాలో చికిత్స తీసుకుని వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

అంతే కాకుండా ఆ త‌ర‌వాత కేర‌ళ లోనూ స‌మంత ఆయుర్వేదం తో వైద్యం తీసుకుంది. కాగా ఇప్పుడు సమంత చికిత్స కోసం కొరియాకు వెళ్లింది అంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. దాంతో ఆమె మేనేజ‌ర్ ఈ వార్త‌ల‌పై స్పందించారు. సమంత ప్ర‌స్తుతం ఆరోగ్యంగానే ఉన్నార‌ని ప్ర‌క‌టించాడు. అంతే కాకుండా ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నార‌ని ఎక్క‌డ‌కూ వెళ్ల‌లేద‌ని స్పష్టం చేశారు.