టాలీవుడ్ నటి సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం యశోద. హరి హరీష్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సినిమా నవంబర్ 11 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా సినిమాగా రూపొందించిన ఈ సినిమా ఏకంగా 5 భాషల్లో విడుదల చేశారు. సరోగసి బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. ఓ బేబీ సినిమా తరువాత సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా కావడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో సమంతకి థియేటర్ల వద్ద అభిమానులు భారీగా కటౌట్లు ఏర్పాట్లు చేయడం విశేషం.
Also Read : ఈ స్టార్ హీరోలు ఇండస్ట్రీకి రాకముందు ఇలాంటి పనులు చేసేవారా..?
Advertisement
కథ :
యశోద కథ విషయానికొస్తే.. జీవితంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న పేద అమ్మాయిలకు డబ్బు ఆశ చూపించి సరోగసి తల్లులుగా మారుస్తుంటారు. సంతానం లేని ధనవంతుల కోరికలను తీర్చే యంత్రాలుగా కొంత మంది డబ్బుల కోసం పని చేస్తుంటారు. వారే సరోగసి తల్లులు. ఒక మాఫియా లాగా తయారవుతారు. ఆ మాఫియా చేసే ఆక త్యాల వల్ల బలైన ఎంతో మంది యువతులతో ఒకరు యశోద. సరోగసి పేరు మీద అక్కడ చేస్తున్న వ్యాపారం ఏంటి ? సరోగసి తల్లులు మారిన స్త్రీలను ఏం చేస్తున్నారు. యశోద చేదించిన భయంకరమైన వాస్తవం ఏమిటి..? యశోద మాఫియాను ఎలా ఎదుర్కొంది అనేది కథ.
కథనం :
Advertisement
ఈ సినిమాలో ఎక్కువగా యాక్షన్ పైనే ఫోకస్ చేశారు. రచన చాలా చప్పగానే ఉందనే చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రొడక్షన్ డిజైన్ బాగుంది. సినిమా కొంచెం స్లోగా.. కొంచెం యాక్షన్ గా సాగుతోంది. సరోగసి ఆసుపత్రిలో కామెంట్లు చేస్తున్నారు. అదేవిధంగా సినిమా మలుపు తిరుగుతుంది. ప్రధానంగా ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశం సినిమాకే హైలెట్ గా నిలిచింది.
Also Read : 1986 ముగ్గురు సీనియర్ హీరోలతో పోటీపడ్డ మెగాస్టార్..గెలిచింది ఎవరంటే..?
ఇంటర్వెల్ తరువాత ఈ సినిమా థ్రిల్లింగ్ గా మారిపోయింది. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ ఇక అదిరిపోయిందనే చెప్పవచ్చు. సమంత ఎప్పటి మాదిరిగానే ఈ సినిమాలో అద్భుతంగా నటించింది. మధ్య మధ్యలో కాస్త బోరు కొట్టినప్పటికీ ఆ తరువాత బోరును మైమరిపించేలా స్క్రీన్ ప్లే కనిపిస్తుంది. మొత్తానికి ఈ సినిమాలో సమంత తన నట విశ్వరూపాన్నే చూపించింది. అమాయక మహిళగా ఆమె నటన అద్భుతమనే చెప్పాలి.
సమంత అన్ని కష్టాల తరువాత క్లైమాక్స్ సింపుల్ గా సిల్లి నోట్ తో ముగుస్తుంది. అక్కడక్కడ కథనం థ్రిల్ లాగా అనిపించదు. ఇందులో ఉన్ని ముకుందం కీలక పాత్రలో కనిపిస్తాడు. రావు రమేష్ రాజకీయ నాయకుడిగా నటించారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా కనిపించిన సంపత్ సిన్సియర్. మురళి శర్మ తదితరులు తమ పాత్రకు న్యాయం చేశారు. మొత్తానికి యశోద సినిమా పర్వాలేదనిపించింది. క్లైమాక్స్ బాగుంటే సినిమా సూపర్ హిట్ గా నిలిచేది.
Also Read : ఆ సినిమా వల్లే SR:ఎన్టీఆర్ 3 నెలలు ఇంటికే పరిమితం అయ్యారా.. జరిగిందేంటంటే..?