టాలీవుడ్ హీరోయిన్ గురించి తెలియని వారుండరు. వరుస సినిమాలతో దూసుకెళ్లుతుంది. ఇటీవల పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్‌లో నటించి మాస్ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. తాజాగా సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆమె ఫిట్ నెస్ జునైద్ షేక్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటుంది. ఆమె అతన్ని తరుచుగా కఠినమైన టాస్క్ మాస్టర్ అని పిలుస్తోంది. సమంత తాజాగా నలుగు రంగు యాక్టివ్ వేర్ ధరించి స్పైడర్ మ్యాన్ జంప్ వ్యాయామాలు చేస్తోంది. సమంత ఎప్పుడూ తన టోన్డ్ బాడీతో తన అభిమానులను ఆకట్టుకుంటుందని చెప్పారు. సోషల్ మీడియాలో తరుచూ తన వ్యాయామ విధానాన్ని పంచుకుంటుంది.
Advertisement
Also Read : పవన్ కళ్యాణ్ కేఏ పాల్ మాట వినాలి….ఆర్జీవీ సెటైర్లు…!
Ad
సమంత ఫిట్ నెస్ శిక్షకుడు జునైద్ షేక్ సమంత గురించి చాలానే చెప్పాడు. ముఖ్యంగా ఫిట్‌నెస్, హ్యాండ్స్ డౌన్ అని చెప్పాలంటే అది సమంతనే అనాలి. డెడ్ లిప్ట్‌లు, స్క్వాట్‌లు, ఏరోబిక్స్ టూ ఏరియల్ యోగా, వంటివి ఎన్ని చేసినా సమంత మాత్రం అలిసి పోలేదట. శిక్షకుడే అలిసి పోయాడని వెల్లడించాడు. మీరు అథ్లెట్ అయితే విరాట్ కోహ్లీలా ఉండేవారని సమంతతో ఎప్పుడు అనేవాడినని జునైద్ షేక్ తెలిపాడు.
సమంత దేనినైనా ఒకటికి రెండు సార్లు ప్రయత్నిస్తుంది. ఆమె చాలా దూకుడుగా ఉంటుంది. ఆమెను చూసి నేను చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా ఓ బేబీ నటి అంటే తెల్లవారుజామున నిద్రలేచి తన వర్కవుట్‌ను పూర్తి చేయాలని నమ్ముతుంది. ఆమె ఊ అంటావా పాట కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు సమంత చాలా కండిషనింగ్ వర్కౌట్‌లు చేసిందని వెల్లడించారు. సమంత వర్కవుట్ల గురించి తన ట్రైనర్ చెప్పుకొచ్చాడు.
Also Read : టాలీవుడ్ లో క్రేజీ కాంబో.. విడాకుల తరువాత విజయ్‌తో జత కట్టనున్న సమంత..!