టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో కూడా స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమంత అంటే ప్రేక్షకులకు ప్రత్యేకమైన అభిమానం. సమంత నటించిన ఏమాయచేసావే సినిమాతోనే టాలీవుడ్, కోలివుడ్‌లో ఆఫర్లను సంపాదించుకుంది. ముఖ్యంగా పెద్ద హీరోలతో నటించి.. తన నటనకు ఎన్నో అవార్డులను అందుకుంది. కొన్ని సినిమాలు ప్లాఫ్ అయినా కానీ సమంత నటన ఆ సినిమాలకు హైలెట్‌గా నిలిచాయి.
Advertisement
నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత ఇద్దరి మధ్య వచ్చిన మనస్పార్థాల మధ్య వచ్చిన మనస్పర్థాల కారణంగా విడాకులు ప్రకటించుకున్నారు. వీరి విడాకులు, సమంతపై పలు యూట్యూబ్ ఛానళ్లు, ఓ జర్నలిస్ట్ రాసిన కథనాలపై కోర్టులో వివాదం కొద్ది రోజుల పాటు నెట్టింట్లో వైరల్ అయింది. ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకునే సమంత విడాకుల తరువాత ఆమె ఎదుర్కొన్న పరిస్థితుల గురించి.. మానసిక సంఘర్షణ గురించి రోష్ని ట్రస్ట్ ఏర్పాటు చేసిన సైకియాట్రి ఎల్ యువర్ స్టెప్ కార్యక్రమంలో సంచలన విషయాలను వెల్లడించింది.
Advertisement
ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ నేను చాలా మానసిక సమస్యలు ఎదుర్కున్నాను. ఇక అలాంటి సమయంలో నాకు తోడు ఉన్నది నా స్నేహితులు మాత్రమే అదేవిదంగా నా వైద్యులు నేను డిప్రెషన్ లోకి వెళ్లినప్పుడు డాక్టర్ సహాయం తీసుకున్నాను. ఇక ఇప్పుడు నేను రోజు మీ ముందు ధైర్యంగా నిలబడడానికి నా జీవితంలో ముందుకు వెళ్లడానికి కారణం నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలితో పాటు కౌన్సిలర్ల సహాయమే. మనకు ఏదైనా దెబ్బ తగిలితే.. డాక్టర్‌లను ఎలాగైతే కలుస్తామో అదేవిధంగా మన మనసుకు గాయమైనప్పుడు వైద్యులను సంప్రదించాలని సమంత చెప్పారు.