Home » SAMANTHA : షాకింగ్…విడాకుల త‌ర‌వాత మొద‌టిసారి చైతూ ఫోటోను షేర్ చేసిన సమంత‌..!

SAMANTHA : షాకింగ్…విడాకుల త‌ర‌వాత మొద‌టిసారి చైతూ ఫోటోను షేర్ చేసిన సమంత‌..!

by AJAY
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత అక్కినేని హీరో నాగ‌చైత‌న్య గ‌తేడాది డిసెంబ‌ర్ లో విడాకుల ప్ర‌క‌ట‌న చేసి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌పరిచిన సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రూ క‌లుసుకోవాల‌ని ఫ్యాన్స్ ఎంత‌గానో కోరుకున్నా అది మాత్రం జ‌ర‌గ‌లేదు. ఇక విడాకుల త‌ర‌వాత ఇద్ద‌రూ త‌మ త‌మ సినిమాల‌తో ఫుల్ బిజీగా మారిపోయారు. స‌మంత ఇప్ప‌టికే పుష్ప సినిమాలో ఊ అంటావా ఊఊ అంటావా పాట‌కు స్టెప్పులు వేసి పాన్ ఇండియా లెవ‌ల్ లో అభిమానులను సంపాదింకుంది.

Advertisement

బాలీవుడ్ ఆఫ‌ర్ ల‌ను కూడా అందుకుంటోంది. మ‌రోవైపు నాగ‌చైత‌న్య కూడా ల‌వ్ స్టోరీ, బంగార్రాజు సినిమాల‌తో హిట్లు అందుకున్నాడు. అంతే కాకుండా అమీర్ ఖాన్ హీరోగా న‌టిస్తున్న ఓ సినిమాతో బాలీవుడ్ కు ప‌రిచ‌యం అవుతున్నాడు. ఇదిలా ఉంటే సమంత చేసిన ఓ ప‌ని ఇప్పుడు అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

Advertisement

samantha-akkineni

స‌మంత చైతూ తో విడాకుల త‌ర‌వాత అత‌డితో దిగిన ఫోటోల‌ను డిలీట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా సోష‌ల్ మీడియాలో స‌మంత చైతూను అన్ ఫాలో చేసింది. కానీ చైతూ మాత్రం ఇప్ప‌టికీ స‌మంత‌ను ఫాలో అవుతున్నాడు. అయితే విడాకులు ప్ర‌క‌టించిన ఆరు నెల‌ల త‌ర‌వాత చైతూ ఫోటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

samantha

వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన మ‌జిలీ సినిమా మంచి విజ‌యం సాధించింది.ఈ సినిమా వ‌చ్చి ఆరేళ్లు అవుతోంది. ఈ నేప‌థ్యంలోనే మజిలీ పోస్ట‌ర్ ను షేర్ చేయ‌గా అందులో చైతూ ఉన్నాడు. ఇక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిన ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. జంట‌గా ఇద్ద‌రికీ కూడా మంచి హిట్ గా నిలించింది.

Visitors Are Also Reading