Home » ఎంత ట్రోల్ చేసిన తగ్గేదేలే అంటున్న సమంత.. ఛీ ప్రీతమ్ తో అలా ఏంటి..?

ఎంత ట్రోల్ చేసిన తగ్గేదేలే అంటున్న సమంత.. ఛీ ప్రీతమ్ తో అలా ఏంటి..?

by Sravanthi Pandrala Pandrala
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే సమంత పేరు ముందుగా తెరపైకి వస్తుంది. నాగ చైతన్య తో వివాహ బంధానికి పులిస్టాప్ పెట్టిన తర్వాత ఈ అమ్మడు తన కెరీర్ పై చాలా దృష్టి పెట్టింది. వరుస సినిమా లతో మరియు యాడ్స్ తో దూసుకు పోతోంది. ఇదే కాకుండా సోషల్ మీడియాలో మాత్రం సంచలనం సృష్టిస్తోంది. పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి తగ్గేదేలే అంటుంది. ప్రస్తుతం ఆమె యశోద మరియు శాకుంతలం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Advertisement

ఈ రెండు మూవీస్ సమంత కు ఎంతో పేరును పెంచడమే కాకుండా మార్కెట్లో తన క్రేజ్ ను అమాంతం పెంచుతాయని అభిమానులు భావిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఎంతో మంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్న సమంత, ఆ ఒక్క విషయంలో మాత్రం అనేక విమర్శలు ఎదుర్కొంటోంది. తాజాగా ఆమె ప్రీతమ్ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఆ ఫోటోలు చూసి కొంత మంది అభిమానులు మాత్రం తీవ్రంగా ఫైర్ అవుతున్నారు.

Advertisement

 

ప్రీతమ్ మరియు సాధన సింగ్ లతో డేట్ నైట్ కు వెళ్తున్నాం అని సమంతా పోస్టు చేయడం గమనార్హం. అయితే ఎన్ని విమర్శలు వచ్చినా సమంత వీటిని పట్టించుకోకుండా తన కెరీర్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా దూసుకుపోతున్నారు. అలాగే ఆమె విజయ్ దేవరకొండ తో ఖుషి అనే మూవీలో కూడా చేస్తున్నారు.

also read;

ఆ హీరో అంటే జక్కన్నకు ఎందుకంత ఇష్టం..!!

ఆ షోలోనే తన వైఫ్ కాళ్ళు పట్టిన జబర్దస్త్ కమెడియన్.. ఎందుకో తెలిస్తే షాక్..?

 

 

Visitors Are Also Reading