Home » SAMANTHA : వ‌దిలేయాల‌ని అనిపించినా సంతోషంగా ముందుకు సాగాను..స‌మంత ఎమోష‌నల్..!

SAMANTHA : వ‌దిలేయాల‌ని అనిపించినా సంతోషంగా ముందుకు సాగాను..స‌మంత ఎమోష‌నల్..!

by AJAY
Ad

సోషల్ మీడియా లో ఎక్కువ ఎక్కువ యాక్టివ్ గా ఉండే హీరోయిన్లలో సమంత కూడా ఒకరు. మిగతా హీరోలతో పోలిస్తే సమంత సోషల్ మీడియాను ఎక్కువగానే వినియోగిస్తుంది. తన సినిమాల వివరాలు, గ్లామర్ ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ నెటిజ‌న్ల‌కు ఎంతో దగ్గరగా ఉంటుంది. అదే విధంగా తాను వెళ్లిన టూర్ ల‌కు సంబంధించిన‌ ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. అయితే రీసెంట్ గా సమంత నాగచైతన్య విడాకులు తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించిన‌ సంగతి తెలిసిందే.

Samantha nagachaitanya

Samantha nagachaitanya

వీరిద్దరూ విడాకులు ప్రకటించిన తర్వాత సమంత చేసే పోస్టులు ఆసక్తికరంగా మారుతున్నాయి. సమంత చేసే కొన్ని పోస్టులు నాగ‌ చైతన్యను ఉద్దేశించే అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తాజాగా సామ్ మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. నేను వంద సార్లు పడిపోయాను కానీ లేచి నిలుచున్నాను….. వదిలేయాలని ఆలోచన వచ్చినా వదిలిపెట్టలేదు అంటూ సమంత తాజా పోస్ట్ లో పేర్కొంది.

Advertisement

Advertisement

అయితే ఈ పోస్టుకు సమంత ఓ వీడియోను కూడా జోడించింది. ప్రస్తుతం సమంత స్విజర్లాండ్ టూర్ లో ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా అక్కడ సమంత మంచులో స్కీయింగ్ నేర్చుకుంది. పది రోజుల పాటు రోజుకు ఐదు నుండి ఆరు గంటల పాటు స్కీయింగ్ కోసం ప్రాక్టీస్ చేసినట్లు స‌మంత‌ తెలిపింది. స్కీయింగ్ కోసం తాను పడిన పాట్ల‌ను చూపిస్తూ వీడియోని షేర్ చేసింది.

ఆ వీడియోకు…. నేను మొద‌ట బన్నీ వాల్ పై స్కీయింగ్ చేయ‌డం ప్రారంభించాను. వందల సార్లు పడిపోయాను తిరిగి లేచాను. వదిలేయాలని నా మనసులో ఆలోచన వచ్చింది. కానీ సంతోషంగా ముందుకు సాగాను. బన్నీ స్లోప్ లనుండి రెడ్ రన్ పూర్తి చేయడానికి పట్టిన సమయం …దానికోసం నేను చేసిన కృషి నిజమైనదని గ్రహించాను. అంటూ సమంత తన పోస్టులో పేర్కొంది.

 

Visitors Are Also Reading