Telugu News » Blog » విడాకుల డిప్రెషన్ నుండి బ‌య‌ట‌కు రాలేక‌పోతున్న స‌మంత‌..? ప్రూఫ్ అదేనా..?

విడాకుల డిప్రెషన్ నుండి బ‌య‌ట‌కు రాలేక‌పోతున్న స‌మంత‌..? ప్రూఫ్ అదేనా..?

by AJAY
Ads

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత స్టార్ హీరో నాగ‌చైత‌న్య గ‌తేడాది డిసెంబ‌ర్ లో విడాకులు తీసుకున్నారు. స‌మంత నాగ‌చైత‌న్య ఫ్యాన్స్ వీరిద్ద‌రూ విడిపోవ‌ద్ద‌ని..క‌లిసే ఉండాల‌ని ఎంతో కోరుకున్నారు. అయిన‌ప్ప‌టికీ స‌మంత నాగ‌చైత‌న్య విడాకుల‌ను ప్ర‌క‌టించి అంద‌ర్నీ షాక్ కు గురి చేశారు. వీరిద్ద‌రూ విడాకులు తీసుకుని నెల‌లు గ‌డుస్తున్నా ఇప్ప‌టికీ వీరి విడాకుల వార్త‌లు నెట్టింట ఏదో ఒక రూపంలో క‌నిపిస్తూనే ఉంటున్నాయి.

స‌మంత రీసెంట్ గా క‌ర‌ణ్ జోహార్ షోకు వ‌చ్చింది. ఆ షోలో స‌మంత ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. కాఫీ విత్ క‌ర‌న్ లో స‌మంత చేసిన కామెంట్స్ చూసి అంద‌రూ షాక్ అయ్యారు. క‌ర‌ణ్ జోహార్ నాగ‌చైత‌న్య‌ను భ‌ర్త అని సంభోదించ‌డంతో మాజీ భ‌ర్త అంటూ సీరియ‌స్ గా చెప్పింది. దాంతో క‌ర‌ణ్ కూడా ఎక్స్ హ‌స్పెంబ్ అంటూ సంభోదించ‌డం మొద‌లు పెట్టాడు.

అంతే కాకుండా నాగ‌చైత‌న్య‌ను నిన్ను ఒకే గ‌దిలో వేస్తే ఏం చేస్తారు అంటూ క‌ర‌ణ్ ప్ర‌శ్నించ‌గా మాతో పాటూ ఆ గ‌దిలో ప‌దునైన ఆయుదాల‌ను కూడా పెట్టాలి అంటూ కామెంట్స్ చేసింది. దాంతో స‌మంత ఇప్ప‌టికీ చైతూను మ‌ర్చిపోలేక‌పోతుందని…ఎక్కువ‌గా ప్రేమించ‌డం వ‌ల్ల‌నే ఎక్కువ ద్వేశిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రేమ ఉన్న చోటే ద్వేశం కోపం ఉంటాయ‌ని నెటిజ‌న్లు భావిస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా స‌మంత రీసెంట్ గా ఎయిర్ పోర్ట్ లో కెమెరాకు చిక్కింది. ఆ ఫోటోల‌లో స‌మంత ఒక బుక్ ను చేతిలో ప‌ట్టుకుని క‌నిపిపిస్తుంది. ఆ బుక్ పేరు యు కెన్ హీల్ యువ‌ర్ లైఫ్…ఈ పుస్త‌కాన్ని ప్ర‌ముఖ ర‌చ‌యిత లూయిస్ హే రాశారు. మాన‌సిక ప్ర‌శాంత‌త కోసం….భావోద్వేగాల‌ను అదుపు చేసుకోవ‌డం కోసం ఈ పుస్తకాన్ని చ‌దువుతుంటారు. కాగా ఇప్పుడు స‌మంత ఇంకా డిప్రెష‌న్ నుండి బ‌య‌ట‌కు రాలేద‌ని అందువ‌ల్లే సైకాల‌జీ పుస్తకాల‌ను చ‌దువుతోందని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.


You may also like