Home » జిమ్ ట్రైనర్స్ నుండి తప్పించుకోలేకపోతున్నాను…?

జిమ్ ట్రైనర్స్ నుండి తప్పించుకోలేకపోతున్నాను…?

by Azhar
Ad

టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో సమంత కూడా ఒకరు. వరుస సూపర్ హిట్ లతో తెలుగు సినీ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన సమంత ప్రస్తుతం ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. ఇప్పుడు కేవలం తెలుగులో శాకుంతలం. యశోద అనే రెండు సినిమాలలో మాత్రమే నటిస్తోంది. అయితే తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో కూడా నటించిన సమంత ఈ మధ్య బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. హిందీలో ఎంతో ఫేమస్ అయిన ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ సిరీస్లో అలాగే పుష్పలో చేసిన ఓ స్పెషల్ సాంగ్ వల్ల సమంతకు బాలీవుడ్ లో కూడా మంచి పేరు వచ్చింది.

Advertisement

ఇదిలా ఉంటే.. సమంత చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అయితే సమంత సినిమా తర్వాత తన ఫిట్నెస్ కు చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. అందుకే తన కోసం స్పెషల్ గా ఇద్దరిని జిమ్ ట్రైనర్ ని కూడా నియమించుకుంది సమంత. వారి పేర్లు మన్ కరానీ , జునైద్ షేక్. ఇక తాజాగా తన జిమ్ ట్రైనర్ ని ఉద్దేశిస్తూ నేను ఎక్కడికి వెళ్ళినా నా ప్రతి మార్నింగ్ వీరినుండి తప్పించుకోలేక పోతున్నాను అంటూ పేర్కొంది

Advertisement

అయితే ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో లో వైరల్ అవుతుంది. ఎందుకంటే…. సమంత, నాగచైతన్య దాదాపు 6 ఏళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ మధ్యనే విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే వీరి విడాకుల సమయంలో సమంత జిమ్ ట్రైనర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. సమంత తన ట్రైనర్ తో చాలా క్లోజ్ గా ఉండటం నాగచైతన్యకు నచ్చడం లేదని…. వీరి విడాకులకు ఇది కూడా ఒక కారణమని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సమంత తన జిమ్ ట్రైనర్ ని ఉద్దేశిస్తూ ఇలా తప్పించుకోలేక పోతున్నాను అంటూ ఈ పోస్ట్ చేయడం చర్చకు దారితీస్తోంది.

ఇవి కూడా చదవండి :

ఉమ్రాన్ కు టీం ఇండియాలో చోటు ఖాయం : గంగూలీ

అంబటి రాయుడు రిటైర్మెంట్.. క్లారిటీ ఇచిన చెన్నై..!

Visitors Are Also Reading