Home » నడుం పై చై, వీపు పై వైఎంసీ…తన తరవాత టాటూ పై సమంత షాకింగ్ కామెంట్స్!

నడుం పై చై, వీపు పై వైఎంసీ…తన తరవాత టాటూ పై సమంత షాకింగ్ కామెంట్స్!

by AJAY
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పరిచయం అక్కర్లేని పేరు. స్టార్ హీరోలతో సినిమాలు చేసిన సమంత ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. కేవలం హీరోయిన్ పాత్రకు ప్రాముఖ్యత ఉన్న సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకుంది. ఇదిలా ఉంటే సమంత గతేడాది డిసెంబర్ లో నాగచైతన్య తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

అయితే దానికి ముందు సమంత సోషల్ మీడియాలో నెటిజన్ల తో చిట్ చాట్ చేసేది. కానీ విడాకుల తరవాత ఎలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి అని చిట్ చాట్ కు దూరంగా ఉన్నట్టు కనిపించింది. కానీ తాజాగా సమంత మరోసారి నెటిజన్లతో ముచ్చటించింది. ఈ క్రమంలో ఇంట్రస్టింగ్ ప్రశ్నలు ఎదురయ్యాయి. మీ మొదటి జీతం ఎంత అని ఓ నెటిజన్ ప్రశ్నించగా….తాను మొదటిసారి ఓ హోటల్ లో ఫంక్షన్ కు హోస్ట్ గా చేశానని తెలిపింది.

Advertisement

అందుకు 8 గంటలు పనిచేస్తే తనకు రూ.500 ఇచ్చారని చెప్పింది. మీరు అమ్మాయిలకు ఇచ్చే సందేశం ఏంటి ఓ నెటిజన్ ప్రశ్నించారు. దానికి సమాధానం ఇస్తూ…..మీకు నచ్చింది చేయండి. మిమ్మల్ని మీరు నమ్ముకొండి అంటూ సమాధానం ఇచ్చింది. ఇక మరో నెటిజన్ మీరు మరో టాటూ ఏమని వేసుకుంటారు అంటూ ప్రశ్నించాడు.

దానికి సమంత అసలు మళ్లీ టాటూ వేసుకోను అంటూ సమాధానం ఇచ్చింది. అలాంటి ఆలోచన ఉంటే మీరు కూడా మానుకోండి అంటూ సమాధానం ఇచ్చింది. ఇదిలా ఉండగా సమంత వీపు పై నాగ చైతన్యతో చేసిన మొదటి సినిమా పేరు ఏం మాయ చేసావే ను షార్ట్ కట్ లో వైఎంసీ అని వేసుకుంది. అంతే కాకుండా నడుము పై చై అంటూ టాటూ వేయించుకుంది. ఇక చేతి పై కూడా ఇద్దరూ ఓకే గుర్తులను వేసుకున్నారు.

Visitors Are Also Reading