Home » హాస్పిటల్ బెడ్ మీద సమంత.. షాక్ లో నాగ చైతన్య..!

హాస్పిటల్ బెడ్ మీద సమంత.. షాక్ లో నాగ చైతన్య..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత చివరిగా పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ లో కనిపించింది. ప్రస్తుతం నాలుగైదు సినిమాలను చేతిలో పెట్టుకొని బిజీ షెడ్యుల్ ని గడుపుతుంది.ముందుగా యశోద అనే సినిమాను పూర్తి చేయబోతోంది. చాలా రోజుల క్రితమే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. చివరిదశ షూటింగులో ఉన్న ఈ సినిమాను ఆగస్టు 12వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అయితే ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా గురించి ఒక అప్ డేట్ వచ్చింది.యశోద సినిమాలో సమంత పాత్రకు సంబంధించి ఒక చిన్న వీడియోను వదిలారు. ఈ వీడియోలో సమంత హాస్పిటల్ బెడ్ నుంచి సడన్ గా లేచి చూస్తుంది. అసలు ఆమె ఎక్కడ ఉందో ఆమెకే తెలియకుండా ఉండేలా ఇంట్రెస్టింగ్ గా ఈ వీడియోని తీశారు. ఈ సినిమాలో సమంత ప్రెగ్నెన్సీ లేడీగా కనిపించనుందని కొంతమంది, మరి కొంతమందైతే నర్సు పాత్రలో నటిస్తుందని అంటున్నారు. అయితే త్వరలోనే ఈ సినిమా లో సమంత క్యారెక్టర్ పై ఓ క్లారిటీ రానుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమా అయినప్పటికీ ఇందులో యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయట.దీని కోసం హాలివుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ ను కూడా తీసుకున్నారు. హరీ,హరీష్ అనే ఇద్దరు డైరెక్టర్లు ఈ సినిమాను రూపొందిస్తున్నారు.శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలింగ కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, కల్పిక గణేష్ వంటి తారలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమాను తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి మణిశర్మ గారు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా చేసిన తర్వాత బాలీవుడ్ లో సినిమాలు చేయబోతోంది సమంత.బాలీవుడ్ లోనే ఓ కాకుండా ఇంటర్నేషనల్ ప్రాజెక్టులో కూడా నటించబోతోంది.

ALSO READ :

ఎన్టీఆర్ అనుష్క క‌లిసి న‌టించాల్సిన ఆ క్రేజీ ప్రాజెక్ట్..మ‌ధ్య‌లోనే ఎందుకు ఆగిపోయిందో తెలుసా..!

స‌మంత పోస్ట్ కు ల‌వ్ యూ టూ అంటూ ప్రీత‌మ్ కామెంట్…ఆ పిలుపుతో రిలేష‌న్షిప్ పై క్లారిటీ..!

 

 

 

Visitors Are Also Reading