టాలీవుడ్ స్టార్ హీరోయిన్సమంత గత ఏడాది భర్త నాగ చైతన్యతో విడిపోయినట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడం వల్ల విడిపోతున్నాం. కానీ ఎప్పటికీ స్నేహితుల మాదిరిగానే ఉంటాం అని ఈ జంట ప్రకటించింది. సామ్ విడాకులు ప్రకటించినప్పటి నుంచి కోట్స్ రూపంలో ఏదో ఒక సందేశాన్ని అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. ఒక్కోసారి తల్లి గురించి.. గర్భం గురించి.. పిల్లల గురించి స్టోరీలు పెట్టడంతో నెటిజన్లు సామ్‌కు తల్లి కావాలని ఉన్నా కొన్ని పరిస్థితుల వలన అది కుదరలేదు అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక సమంత- చై మ్యూచువల్ అభిమానులు ఈ జంట మళ్లీ కలవాలని కోరుకుంటున్నారు. అప్పట్లో సామ్ గురించి చైతన్య చేసిన కామెంట్స్ చైతు గురించి సామ్ చెప్పిన విసయాలను నెమరు వేసుకుంటున్నారు.
Also Read : అల్లు అర్జున్ కు ఆలియా భట్ గ్రీన్ సిగ్నల్…!
Advertisement
Advertisement
తాజాగా సామ్ చెప్పిన ఒక విషయాన్ని మరోసారి నెటిజన్లు వైరల్ గా మార్చేశారు. గతంలో సామ్ కొద్దిగా బొద్దుగా కనిపించినా, ఇంకొద్దిగా మార్పు కనిపించినా సామ్ ప్రెగ్నెంటా..? అంటూ అభిమానులు ఎంతో ఆశగా అడిగేవారు. ఒకానొక సమయంలో సామ్ నవ్వుతూ తన ప్రెగ్నెన్సీ గురించి చెప్పిన మాటలు మరొకసారి వైరల్ గా మారాయి. ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్లో ఒక నెటిజన్ మీరు తల్లి ఎప్పుడవుతారు అన్న ప్రశ్నకు సామ్ నా శరీరంలో వచ్చే మార్పుల గురించి మీరెంతో తపన పడుతున్నారో నాకర్థమవుతుంది. వారందరికీ ఒక మంచి న్యూస్ చెప్పాను. 2022 ఆగస్టు 07న ఉదయం 7 గంటలకు ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నా అంటూ చెప్పుకొచ్చింది. ఈ మాటలు సామ్ జోక్‌గా అన్నా నిజమైతే బాగుండు అని ప్రతి ఒక్క అభిమాని కోరుకున్నాడంటే అతిశయోక్తి కాదు.
ఒకవేళ సమంత చెప్పింది వాస్తవమే అయితే ఈ జంట విడిపోకుండా ఉంటే ఈ పాటికి ఒక శుభవార్తని అక్కినేని ఫ్యామిలీ అభిమానులకు తెలిపి ఉండేదని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఇదే వార్త నిజమయ్యే అవకాశాలు లేకపోలేదు. అంటే నిజంగా కాకపోయినా సినిమాలో నిజమయ్యే అవకాశముందనే చెప్పాలి. ప్రస్తుతం సమంత తెలుగు, తమిళంలో ఒక బె లింగువల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో సామ్ ప్రెగ్నెంట్ లేడీ నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆగస్టు 07న ఈ సినిమాకు సంబంధించి పోస్టర్ విడుదల అయ్యే అవకాశం లేకపోలేదు. ఆగస్టు 07న ఎలాంటి అప్డేట్నుఇవ్వనుందనేది వేచి చూడాలి.
Also Read : రాక్ స్టార్ అని పిలవొద్దన్న తమన్…వీడియో వైరల్…!