Home » అఖిల్ సినిమా కోసం సమంత సినిమా వాయిదా…?

అఖిల్ సినిమా కోసం సమంత సినిమా వాయిదా…?

by Azhar

అక్కినేని కుటుంబం నుండి వచ్చిన నాగ చైతన్య ఒక్కడే ఇప్పుడు టాలీవుడ్ లో మనషి స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. కానీ అఖిల్ మాత్రం తాను హీరోగా నిరూపించుకోవడానికి కష్టపడుతున్నాడు. అయితే ఇప్పటివరకు అఖిల్ హీరోగా వచ్చిన రెండు సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి. అందుకే అతని ఆశలు అన్ని ఇప్పుడు నటిస్తున్న ఏజెంట్ సినిమా పైనే ఉన్నాయి. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే ఈ సినిమా అనౌన్స్ అనేది ఎప్పుడో అయ్యిన విషయం తెలిసిందే. కానీ తాజాగా ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో డిసెంబర్ లో విడుదల చేయాలనీ ప్లాన్ చేసారు. కానీ అంతకముందే సమంత – విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్న ఖుషి సినిమాను డిసెంబర్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ సినిమా అనేది వాయిదా పడినట్లు కనిపిస్తుంది. అయితే విజయ్ ఈ సినిమాను అక్టోబర్ వరకు పూర్తి చేయాలని అనుకున్నాడు.

కానీ ఇప్పుడు లైగర్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉండటంతో ఖుషి షూటింగ్ అనేది ఆలస్యం అవుతుంది. అందుకే అనుకున్న విధంగా డిసెంబర్ లో కాకుండా ఆ తర్వాత 2023 లో జనవరి చివర్లో విడుదల చేయాలనీ తమ ప్లాన్ అనేది మార్చుకున్నారు. ఇక సమంత యొక్క ఈ సినిమా అనేది అక్కినేని అఖిల్ సినిమా రాగానే వెన్నకి వెళ్ళడానికి నిర్ణయిచుకోవడంతో.. ఫ్యాన్స్ రకరకాలుగా ట్రోల్స్ అనేవి చేస్తున్నారు. అయితే ఈ మధ్యే సమంత అక్కనేని ఫ్యామిలీ నుండి విడిపోయిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

టెస్ట్ అని చెప్పి చిక్కులో పడిన రోహిత్…!

ఆసియా కప్ షెడ్యూల్‌ విడుదల.. మొదటే భారత్, పాక్ పోరు..!

Visitors Are Also Reading