Home » “ఊ అంటావా మావా” సాంగ్ కు మొదట అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా… ఆ నటి కానీ చేసుకుంటే..!

“ఊ అంటావా మావా” సాంగ్ కు మొదట అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా… ఆ నటి కానీ చేసుకుంటే..!

by AJAY
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ఈయన ఆఖరుగా పుష్ప ది రైస్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా… వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా… ఈ సినిమాలో ఫాహధ్ ఫజిల్ విలన్ పాత్రలో నటించాడు.

Advertisement

సునీల్ , అనసూయ , రావు రమేష్ ఈ మూవీలో ఇతర ముఖ్యపాత్రల్లో నటించగా టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు అయినటువంటి సమంత ఈ సినిమాలో “ఊ అంటావా మావా.. ఊహు అంటావా” అంటూ సాగే ఐటమ్ సాంగ్ లో నటించింది. ఈ మూవీ విడుదలకు ముందు అలాగే ఈ సినిమా విడుదల అయిన తర్వాత చాలా రోజుల వరకు ఈ పాట సోషల్ మీడియాను ఒక ఊపు ఊపింది.

Advertisement

అలాగే ఈ మూవీలోని ఈ వీడియో సాంగ్ లో సమంత చేసిన డ్యాన్స్ కు… ఆరబోసిన అందచందాలకు… ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కు ఎంతోమంది ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ మూవీ లోని ఐటెం సాంగ్ తో సమంత క్రేజ్ కూడా అదిరిపోయే రేంజ్ లో పెరిగిపోయింది. ఇలా ఈ మూవీలోని ఐటెం సాంగ్ తో అద్భుతమైన క్రేజ్ ను సమంత సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే మొదట ఈ మూవీలోని ఐటెం సాంగ్ లో సమంతను తీసుకోవాలి అని బృందం బృందం అనుకోలేదట.

dishapatani

dishapatani

ఈ మూవీలోని ఐటెం సాంగ్ లో మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ దిశా పటాని ని తీసుకోవాలి అని ఈ మూవీ మేకర్స్ అనుకున్నారట. కాకపోతే అల్లు అర్జున్ మాత్రం ఈ సాంగ్లో సమంత అయితే చాలా బాగుంటుందేమో అనే ప్రతిపాదనను తేవడంతో బన్నీ మాటలనుకు రెస్పెక్ట్ ఇచ్చిన మూవీ బృందం సమంత ను సంప్రదించగా సమంత ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Visitors Are Also Reading