Home » తనకంటే పెద్ద వయసు హీరోయిన్ కు తల్లిగా చేస్తున్న సమంత..!!

తనకంటే పెద్ద వయసు హీరోయిన్ కు తల్లిగా చేస్తున్న సమంత..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన నటనతో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది సమంత. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. అయితే సమంత ఇటీవల శాకుంతలం సినిమాతో పలకరించింది. సినిమా డిజాస్టర్ అయినా కానీ సమంత క్రేజ్ ఏమీ తగ్గలేదు. సమంత సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ది ఫ్యామిలీ మెన్ క్రియేటర్స్ రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు.

Advertisement

ప్రస్తుతం దీనికి సంబంధించి ఇంకో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వరుణ్ ధావన్ హీరోగా చేస్తున్న ఈ సిరీస్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇంగ్లీష్ వెర్షన్లో ప్రియాంక చోప్రా చేసిన పాత్రలో సమంత నటిస్తోంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సీటాడెల్ ఇంగ్లీష్ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ లో కనిపిస్తోంది. అంటే సిరీస్ కి ఎంత క్రేజ్ వచ్చిందో తెలుసుకోవచ్చు. ఇక సీటాడెల్ ఇంగ్లీష్ వెర్షన్ ఐదవ ఎపిసోడ్లో ప్రియాంక చోప్రా యొక్క తండ్రి పాత్రకు డబ్బింగ్ చెప్పడం జరిగింది.

Advertisement

అంటే సిటాడెల్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ లో ప్రియాంక చోప్రా తండ్రి వరుణ్ ధావన్ అని క్లారిటీ వచ్చింది. ఇక సమంత కూతురు ప్రియాంక చోప్రా అనే విషయం దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే ఇన్ని రోజులు చాలామంది ఇంగ్లీష్ సిటాడెల్ కు రీమేక్ గా హిందీ సిటాడెల్ రూపొందుతుంది అనుకున్నారు. కానీ అసలు విషయంలోకి వెళ్తే ఇంగ్లీష్ సిటాడెల్ కి సీక్వెల్ గా హిందీ సిటాడెల్ రూపొందుతోంది. అయితే ప్రియాంక చోప్రా తల్లిదండ్రులుగా వరుణ్ ధావన్ సమంత కనిపించబోతున్నారట.

మరికొన్ని ముఖ్య వార్తలు :

 

Visitors Are Also Reading