Home » దెయ్యంగా కనిపించబోతున్న సమంత..!

దెయ్యంగా కనిపించబోతున్న సమంత..!

by Azhar
Ad

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లలో ఒక్కరిగా కొనసాగిన సమంత నాగ చైతన్యతో పెళ్లి తర్వాత కాస్త వేగం అనేది తగ్గించింది. కానీ పూర్తిగా ఆపలేదు. ఇక గత ఏడాది విడాకులు అనేవి తీసుకున్న తర్వాత మళ్ళీ ట్రాక్ ఎక్కాలని చూస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలు చేస్తుంది సమంత. యశోద, శాకుంతలం వంటి సినిమాలతో పాటుగా విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి అనే సినిమా కూడా చేస్తుంది.

Advertisement

ఈ క్రమంలోనే సమంత గురించి తాజాగా ఓ వాదన అనేది తెర మీదకు వచ్చింది. అదేంటంటే ఈ సినిమాలు ఏనేవి పూర్తి అయిన తర్వాత సమంత కేవలం హిందీ సినిమాలు మాత్రమే చేస్తుంది అనే వాదన వస్తుంది. అలాగే ఇప్పటికే హిందీలో ఒక్క సినిమా చేయడనికి కూడా సమంత గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆయా సినిమాలోనే సమంత దెయ్యంగా కనిపించబోతుంది అని తెలుస్తుంది.

Advertisement

మొదటిసారిగా హిందీలో సమంత ఓ హర్రర్ కామెడీ సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది అని సమాచారం. ఇక ఈ సినిమాలోనే సమంత కొత్తగా దెయ్యం పాత్రలో కనిపించబోతుంది అని వార్తలు వస్తున్నాయి. అదే విధంగా సమంత ఇక మీదట బాలీవుడ్ కు ప్రాముఖ్యత ఇచ్చే విషయం నిజమే కానీ సౌత్ సినిమాలను పూర్తిగా దూరం పెట్టదు అని తెలుస్తుంది. సౌత్ నుండి ఏదైనా మంచి కథ అనేది వస్తే అందులో చేయటానికి సమంత రెడీగా ఉంటుంది అని ఆమె సన్నిహితులు చెప్పినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి :

రోహిత్ కు కోహ్లీలో సగం ఉన్న ఎంతో గొప్ప ఆటగాడే..!

కేఎల్ రాహుల్ త్యాగం చేయాలి..!

Visitors Are Also Reading