Home » అక్కినేని నాగార్జున‌కు షాక్‌.. బిగ్ బాస్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న స‌మంత‌..!

అక్కినేని నాగార్జున‌కు షాక్‌.. బిగ్ బాస్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న స‌మంత‌..!

by Anji
Ad

అక్కినేని వారసుల‌లో ఒక‌రైన‌ నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత పెళ్లయిన నాలుగేళ్లకు బ్రేకప్ చెప్పిన విషయం అంద‌రికీ తెలిసిన‌దే. ఇక వీరి విడాకుల తర్వాత చైత‌న్య‌కు దూరంగా ఉంటున్న సమంత అక్కినేని- దగ్గుబాటి ఫ్యామిలీలకు దగ్గరగానే ఉంటుంది. ప్రస్తుతం సమంత నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే ఆమె రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో కలిసి ఓ సినిమా చేస్తున్న విష‌యం విధిత‌మే. మెచ్యూర్ లవ్ స్టోరీ తో వస్తున్న ఈ సినిమాకు కు సంబంధించి ఇటీవలే ఓ కీల‌క అప్ డేట్ వచ్చింది. ఈ ఆసక్తిక‌ర‌మైన‌ ప్రాజెక్ట్ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను తాజాగా విడుదల చేసారు. ఖుషి అంటూ వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందనే ల‌భిస్తోంది.


ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం కాశ్మీర్ లో షూటింగ్ జరుపుకుంటోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇక సమంత నటించిన శాకుంతలం, యశోద చిత్రాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా సామ్‌కి సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. బిగ్ బాస్ హోస్ట్‌గా సమంత చేయనున్న‌దా అంటే అవుననే పేర్కొంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. బిగ్ బాస్ రియాలిటీ షోకు గత మూడు సీజన్స్ ల‌ను నాగార్జున హూస్ట్‌గా చేశారు. వచ్చే ఆరవ సీజన్ కు హూస్టింగ్ చేయనని నాగర్జున చెప్పార‌ట‌. దీంతో బిగ్ బాస్ టీమ్ సమంత ను రంగంలోకి దించిందని స‌మాచారం. ఇక ఆరో సీజ‌న్ అతి త్వరలో ప్రారంభం కానున్న‌ది.

Advertisement

Advertisement

ఆరో సీజ‌న్‌కు సమంత హూస్ట్ గా చేయనున్న‌దని.. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన రానుందని పేర్కొంటున్నారు. ఈ వార్తలో వాస్త‌వం ఎంత ఉంద‌నేది మాత్రం చూడాలి. ఇక మరోవైపు సమంత ఆస్తుల గురించి మ‌రొక‌సారి సోషల్ మీడియాలో చర్చలు కొన‌సాగుతున్నాయి. ఆమె ఆస్తులు ఎన్ని కోట్లకు ఉంటాయని. ఒక్కో సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారని ప‌లువురు నెటిజ‌న్లు చర్చించుకుంటున్నారు. సమంత ఒక్కో సినిమా కు 2 నుంచి 3 కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుందని అంటున్నారు. సమంత తన పదేళ్ల కెరీర్ లో మొత్తం రూ.100 కోట్లు విలువ చేసే ఆస్తులకు పైగా సంపాదించిన‌ట్టు స‌మాచారం.

Also Read : 

అక్కినేని కోడలు అమల నగలు ఎందుకు వేసుకోరో మీకు తెలుసా…?

పవన్ సినిమా నుండి పూజా ఎందుకు తప్పుకుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

 

Visitors Are Also Reading