స్టార్ హీరోయిన్ సమంత తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. సమంత చర్మ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతుందని.. దాంతో చికిత్స కోసం విదేశాలకు వెళ్లిందని కొద్ది రోజులలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. అందుకోసమే షూటింగ్లకు కూడా సమంత దూరంగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను సమంత మేనేజర్ మాత్రం ఖండించారు. ఇదిలా ఉంటే సమంత గురించి ఇప్పుడు మరో వార్త వైరల్ అవుతోంది.
Advertisement
సమంత గతేడాది డిసెంబర్ లో నాగచైతన్య తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల పాటు డేటింగ్ లో ఉన్న సమంత నాగచైతన్య పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. గోవాలో వీరి వివాహం ఘనంగా జరిగింది. కానీ ఈ జంట అందరూ ఊహించిన విధంగానే ఎక్కువకాలం కలిసి ఉండలేకపోయారు. తాము విడిపోయినప్పటికీ స్నేహితుల మాదిరిగా ఉంటామని విడాకులు తీసుకులను ప్రకటించారు.
Advertisement
సమంత నాగచైతన్య ఎవరి సినిమాలతో వారు ఫుల్ బిజీగా ఉన్నారు. అయినప్పటికీ సమంత చైతూల గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా సమంత రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సమంతకు సన్నిహితుడు అయినా జగ్గీ వసుదేవ్ అలియాస్ సద్గురు సమంతకు దగ్గరుండి రెండో పెళ్లి చేయబోతున్నారట.
Advertisement
చైతూతో విడాకుల అనంతరం సమంత డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ సమంత డిప్రెషన్ లో నుండి బయటకు రాలేకపోతుందట. దాంతో సద్గురు రెండో పెళ్లి చేసుకోవాలని సలహా ఇచ్చారట. అంతేకాకుండా సద్గురు చూసిన అబ్బాయి తోనే ఇప్పుడు సమంత రెండో పెళ్లి జరగబోతుంది అనేది టాక్ .అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.