Telugu News » Blog » “శాకుంతలం” నుంచి ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చిన సమంత..!

“శాకుంతలం” నుంచి ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చిన సమంత..!

by Anji

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా శాకుంతలం. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించాడు. ఈ చిత్రంతో మలయాళం నటుడు దేవ్ మోహన్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఈ చిత్రంపై మరింత హైప్ క్రియేట్ చేసింది.

Advertisement

Samantha's 'Shaakuntalam' to release on November 4 - The Hindu

సమంత శకుంతల పాత్రలో కనిపించనుండగా.. దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ కనిపించనున్నాడు. మైథలాజికల్ చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేథప్యంలోనే తాజాగా సమంత సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఆకట్టుకుంటుంది. 

Also Read :  “లవ్ టూడే” సినిమా హీరోయిన్‌ ఇవానా షాజీ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Advertisement

శాకుంతలం చిత్రం నుంచి మల్లిక అనే పల్లవితో సాగే ఫస్ట్ సాంగ్ ని జనవరి 18న విడుదల చేయనున్నట్టు సమంత తన ఇన్ స్టా వేదికగా తెలిపింది. ఈ విషయాన్ని సమంత షేర్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంది. ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, థియేట్రికల్ ట్రైలర్ తో శాకుంతలం సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ఇదిలా ఉంటే.. యశోద సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. కొద్ది రోజులుగా సమంత మయోసైటిస్ సమస్యతో బాధపడుతూ ఇంట్లోనే చికిత్స తీసుకుంది. ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా కోలుకుంటోంది. త్వరలో సామ్ దర్శకుడు శివ నిర్వాణ, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రాబోయే ఖుషి చిత్రీకరణలో పాల్గొబోతుంది.  

Also Read :  వామ్మో కొత్త బంగారు లోకం హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి..?