Telugu News » చైతూతో విడాకుల అనంత‌రం చ‌నిపోతా అనుకున్నా కానీ…మొద‌టి సారి పెద‌వి విప్పిన స‌మంత‌..!

చైతూతో విడాకుల అనంత‌రం చ‌నిపోతా అనుకున్నా కానీ…మొద‌టి సారి పెద‌వి విప్పిన స‌మంత‌..!

by AJAY MADDIBOINA

టాలీవుడ్ ముద్దుగుమ్మ సమంత నాగచైతన్య మ‌ధ్య‌ విడాకులు జరిగిన‌ సంగతి తెలిసిందే. ఏమ్మాయ‌ చేసావే సినిమా షూటింగ్ సమయంలో చైతూ సమంత ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వీరి ప్రేమ బలంగా మారడంతో ఇద్దరు గోవాలో కుటుంబ స‌భ్యులు స‌న్నిహితుల మ‌ధ్య అంగ‌రంగ వైభ‌వంగా వివాహం చేసుకున్నారు. అయితే కొన్నేళ్ల బంధం త‌ర‌వాత సడెన్ గా తాము విడిపోతున్నట్లు చైతూ, సమంత సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇక విడాకుల తర్వాత నాగచైతన్య తన సినిమాలతో బిజీగా ఉండ‌గా సమంత సైతం సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంది. సమంత విడాకులకు కారణం ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో నటించడం… పిల్లలను క‌నేందుకు నిరాకరించడం అంటూ పలు ఆరోపణలు వచ్చాయి.

Ads
samantha-akkineni

samantha-akkineni

కానీ ఆ ఆరోపణలను సమంత సన్నిహితులు ఖండించారు. సమంత పిల్లలను కనాలని అనుకుంద‌ని…అందుకోసం సినిమాలకు గ్యాప్ ఇచ్చి కొద్దిరోజులు ఫ్యామిలీతో గడపాలని అనుకుంద‌ని…. కానీ ఇంతలోనే ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరు విడిపోయారు అంటూ తెలిపారు. అయితే సమంత మాత్రం తన విడాకుల అంశంపై ఎప్పుడూ స్పందించలేదు. కానీ తరచుగా జీవితానికి సంబంధించిన కొటేషన్ ల‌ను మాత్రం తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మొద‌టిసారి త‌న విడాకుల అశంపై స‌మంత‌ స్పందించింది.

also read : బిగ్ బాస్ లోకి రావడానికి లంచం…అస‌లు నిజాలు బయటపెట్టిన జెస్సీ…!

నాగ చైతన్య తో విడాకుల తర్వాత కుంగిపోయి చనిపోతా అని అనుకున్నాను అంటూ సమంత సంచలన వ్యాఖ్యలు చేసింది. నేను చాలా బలహీనమైన వ్యక్తిని అని నా ఫీలింగ్… కానీ నేను ఎంత బలంగా ఉన్నానో నాకు తెలిసి ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది అంటూ పేర్కొంది. నేను ఇంత ధృడంగా ఉండాలని అనుకోలేదు అంటూ సమంత ఇంగ్లీష్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది.


You may also like