Telugu News » Blog » Naga Chaitanya samantha: నాగ‌చైత‌న్య‌, సమంతల కు అధికారికంగా విడాకులు వ‌చ్చేది ఎప్పుడంటే..?

Naga Chaitanya samantha: నాగ‌చైత‌న్య‌, సమంతల కు అధికారికంగా విడాకులు వ‌చ్చేది ఎప్పుడంటే..?

by Anji
Ads

అక్కినేని నాగ‌చైత‌న్య‌, పాపుల‌ర్ నటి స‌మంత‌లు ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్నేళ్ల పాటు వీరి జీవితం స‌జావుగానే సాగింది. అక‌స్మాత్తుగా కొద్ది రోజుల కింద‌ట స‌మంత‌, నాగ‌చైత‌న్య దంప‌తులు విడిపోతున్న‌ట్టు అధికారికంగా ప్ర‌క‌ట‌న చేశారు. ముఖ్యంగా ప‌లుమార్లు ఆలోచించిన త‌రువాత‌నే ఈ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు కూడా చెప్పారు. పెద్ద‌ల సమ‌క్షంలోనే చ‌ర్చ జ‌రిగిందని చెప్పారు. విడిపోయిన త‌రువాత ఇద్ద‌రూ కూడా వారి సినిమాల‌తో బిజీ అయ్యారు. వారు అధికారికంగా విడిపోయారా..? వారికి కోర్టు విడాకులు ఇచ్చిందా అనేది ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Advertisement

samantha and naga chaitanya divorce news

వారిద్ద‌రూ కూడా మ‌ళ్లీ పెళ్లి చేసుకోవాలంటే క‌చ్చితంగా అధికారికంగా విడాకులు తీసుకోవాల‌ట‌. ఫ్యామిలీ కోర్టులో ఇద్ద‌రూ కూడా విడాకుల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుంటే కొన్ని నెల‌ల స‌మ‌యం త‌రువాత వారు ఇద్ద‌రూ విడిపోయినట్టు కోర్టు అన‌ధికారికంగా విడాకులు ఇస్తుంది. ఇది ప్ర‌తీ ఒక్క‌రి విష‌యంలో చోటు చేసుకుంటుంది. అయితే సెల‌బ్రిటీలు స్టార్లు కాబ‌ట్టి వారికేమి ప్ర‌త్యేకమైన న్యాయం ఉంటుందేమో అని ప‌లువురు అనుకుంటారు. కానీ అలాంటిది ఏమి లేదు. అంద‌రికీ ఒకే విధ‌మైన న్యాయం ఉంటుంది. వారు కూడా తొలుత ఫ్యామిలీ కోర్టులో విడాకులు తీసుకున్న త‌రువాత.. ఇద్ద‌రూ కోర్టులో అప్లై చేసుకోవాల్సిందే. కోర్టు ఒక తేదీని నిర్ణ‌యిస్తుంటుంది. వారిద్ద‌రూ కూడా ఆరోజు కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది.

Advertisement

Samantha Akkineni snaps when asked about her separation rumours from Naga Chaitanya during her spiritual visit - Times of India

స‌మంత, నాగ‌చైత‌న్య‌లు అధికారికంగా విడిపోవాలంటే క‌నీసం ఒక్క‌సారైనా కోర్టుకు వెళ్లాలి. కానీ ఇప్ప‌టివ‌ర‌కు వారిద్ద‌రూ కూడా కోర్టుకు వెళ్ల‌లేదు. ఇద్ద‌రికీ కూడా ఇంకా అధికారికంగా విడాకులు రాలేద‌నే టాక్ వినిపిస్తోంది. అయితే కోర్టు ప్ర‌త్యేకంగా క‌రోనా కార‌ణంగా వారికి విడాకులు క‌ల్పిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.  ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వీరి విడాకుల గురించే చ‌ర్చ జ‌రుగుతుంది. కొంద‌రూ అభిమానులు వీరిద్ద‌రూ మ‌ళ్లీ క‌లుస్తే బాగుండు అని అంటున్నాడు. మ‌రికొంద‌రు అభిమానులు సమంత‌, నాగ‌చైత‌న్య జంట టాలీవుడ్ బెస్ట్ క‌పుల్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మ‌రీ వీరిరువురు కోర్టులో విడాకుల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుంటారా.. లేక ఇలాగే కొన‌సాగుతారా అనేది మాత్రం తేలాల్సి ఉంది.

Advertisement

Also Read: నేను జోక్ చేశా.. సారీ సైనా..సిద్ధార్థ్ బహిరంగ క్షమాపణలు…!

You may also like